ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 మే 2017 (08:18 IST)

'డీజే శరణం.. భజే భజే..' అంటున్న అల్లు అర్జున్.. డీజే ఫస్ట్ సాంగ్ రిలీజ్ (Audio)

దర్శకుడు హ‌రీశ్ శంక‌ర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రంలోని తొలి పాటను సోమవారం రిలీజ్ చేశారు. ‘డీజే

దర్శకుడు హ‌రీశ్ శంక‌ర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రంలోని తొలి పాటను సోమవారం రిలీజ్ చేశారు. ‘డీజే శరణం.. భజే భజే..’ అనే పాట‌ను ఆ సినిమా యూనిట్ యూ ట్యూబ్‌లో రిలీజ్ చేయగా, ఇది సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.
 
‘శరణం భజే భజే..’ అంటూ సాగే ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు కూర్చగా, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యం అందించారు. కాగా, ఈ సినిమాలో బ‌న్నీ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టిస్తోంది. వ‌చ్చేనెల ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. విడుద‌లైన గంటలోనే ఈ పాటను ల‌క్ష మందికి పైగా అభిమానులు, నెటిజన్లు వీక్షించారు. 
 
ఈ పాట విడుదల తర్వాత నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ 'మా బేనర్‌లో ఇది 25వ చిత్రం. ‘ఆర్య’, ‘పరుగు’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ మా బేనర్‌లో చేస్తున్న సినిమా ఇది. ఇందులో ఇప్పటివరకూ చూడని రూపంలో బన్నీని చూస్తారు. ఇదివరకే టీజర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘శరణం భజే భజే..’ పాట అందర్నీ ఆకట్టుకుంటుంది' అని చెప్పారు. కాగా, ఈ చిత్రం వచ్చే నెల 23వ తేదీ విడుదల కానుంది. ‘శరణం భజే భజే’ పాటలో హీరో పాత్ర తీరుతెన్నులు స్పష్టమవుతున్నాయి.