ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (10:15 IST)

త్రిష పూజ‌లు ఎందుకు చేసిందో తెలుసా!

Trisha
త్రిష కెరీర్ ఇప్పుడు అంత ఆశాజ‌న‌కంగా లేదు. ఆమ‌ధ్య నిశ్చితార్థంకూడా కేన్సిల్ అయింది. కానీ సినిమాల‌పై ఇంట్రెస్ట్ అలానే వుంది. త‌న మ‌న‌సుకు న‌చ్చిన‌వాడు ఇంత‌వ‌ర‌కు దొర‌క‌లేద‌ని చెబుతోంది. అయితే త‌న‌కు న‌చ్చివాడు ఒక‌డున్నాడు. అంటూ నిన్న‌నే మధ్యప్రదేశ్‌ లోని ఓ గుడిలో త్రిష‌ ప్రత్యేక పూజలు చేసింది. అది సినిమాలో త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తికోసం స‌న్నివేశ‌ప‌రంగా పూజ చేయాల్సివ‌చ్చింద‌ట‌. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ తెలియ‌జేస్తుంది. మణిరత్నం డైరెక్షన్ లో రాబోతున్న పీరియాడికల్‌ ఫిల్మ్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ కోసం అట. ఈ చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఓర్చా లొకేషన్స్‌ లో శరవేగంగా జరుగుతోంది.
 
ఈ సినిమాలో స్టార్ హీరో విక్రమ్, మరో స్టార్ ‘జయం’రవి, ఐశ్వర్యా రాయ్, ఐశ్వర్యా లక్ష్మీ, శరత్‌ కుమార్, పార్తీబన్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఇప్ప‌టికే చాలా భాగం పూర్త‌యింది. కోవిడ్ వ‌ల‌న ఆల‌స్య‌మైంది. కాగా, ఈ  షెడ్యూల్ లో హీరో కార్తీతో పాటు త్రిష, ప్రకాశ్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. వారి పై కొన్ని కీలక సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం తొలి భాగం వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది.