1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (09:40 IST)

అన్నా చెల్లెలుగా మెగాస్టార్‌ చిరంజీవి కీర్తిసురేశ్‌

chiru-keerty
`భోళా శంక‌ర్‌` చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ న‌టిస్తున్నారు. సినిమా కోల్‌క‌తా బ్యాక్‌డ్రాప్‌లో రూపొంద‌నుంది. ర‌క్షా బంధ‌న్ సంద‌ర్భంగా  కీర్తిసురేశ్ చిరంజీవికి రాఖీ క‌ట్టి``చెల్లెలంద‌రీ ర‌క్షాబంధం.  అభిమానులంద‌రి ఆత్మ బంధం... మ‌న అంద‌రి అన్న‌య్య జ‌న్మ‌దినం.. హ్యాపీ బ‌ర్త్ డే అన్న‌య్య‌...`` అంటూ ఆయ‌న‌కు పుట్టిన‌రోజు అభినంద‌న‌లు తెలిపారు. `భోళా శంక‌ర్‌` సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంది. అలాగే నేష‌న‌ల్ రేంజ్‌లో ఈ న్యూస్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
 
ఈ చిత్రంలో అన్నాచెల్లెల మ‌ధ్య అనుబంధమే మెయిన్ హైలెట్. చిరంజీవి, కీర్తిసురేశ్ అన్నా చెల్లెలుగా ఆక‌ట్టుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన వీడియో మ‌న‌కు చాలా కాలం గుర్తుండిపోతుంది. అలాగే సినిమాలో వీరి మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని తెలియ‌జేస్తుంది
`భోళా శంక‌ర్‌`లో చెల్లెలు పాత్ర చాలా కీలకం. ఆ పాత్ర‌కు కీర్తి సురేశ్‌ను ఎంపిక చేసుకోవ‌డమే కాదు, ర‌క్షా బంధ‌న్ రోజున ఈ సినిమాను అనౌన్స్‌మెంట్‌ను చేయ‌డ‌మ‌నేది క‌రెక్ట్ ఛాయిస్‌.
 
``ఈ ప‌విత్ర‌మైన రోజున మెగాస్టార్ చిరంజీవిగారికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేయ‌డం ఆనందంగా ఉంది. మీతో క‌లిసి న‌టించ‌డ‌మ‌నేది నా క‌ల‌. ఈ అద్భుత‌మైన ప్ర‌యాణం ఎప్పుడు ఎదురువుతుందా! అని ఎదురుచూడ‌లేక‌పోతున్నాను. హ్యాపీ బ‌ర్త్ డే అన్న‌య్య‌`` అంటూ త‌న ట్విట్ట‌ర్‌లో మెసేజ్‌ను పోస్ట్ చేస్తూ కీర్తి సురేశ్ వీడియోను విడుద‌ల చేసింది.
 
ర‌క్షా బంధ‌న్ రోజున విడుద‌లైన ఈ వీడియోకు యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌హ‌తి సాగ‌ర్ ఆహ్లాద‌క‌ర‌మైన‌ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను చాలా స్టైలిష్‌గా తెర‌కెక్కిస్తాడ‌నే పేరున్న డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేశ్.. ఈ `భోళా శంక‌ర్‌` సినిమాను ప్యామిలీ ఎమోష‌న్స్‌తో స్టైలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించ‌బోతున్నార‌ని అర్థ‌మ‌వుతుంది.
 
చిరంజీవి, మెహ‌ర్ ర‌మేశ్ కాంబినేష‌న్‌లో ..అనీల్ సుంక‌ర త‌న ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ అసోషియేష‌న్‌తో నిర్మిస్తోన్న `భోళా శంక‌ర్‌` మూవీ.షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. 2022లో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
 
సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ మోష‌న్ పోస్ట‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తుంది. యూట్యూబ్‌లో ఈ వీడియోట్రెండింగ్‌లో ఉంది. అలాగే ఈ స్పెష‌ల్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచ‌నాలు నెక్ట్స్ లెవ‌ల్‌కు వెళ్లాయి.