శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2019 (11:07 IST)

'కల్కి' టీజర్.. భలే ముహూర్తం పెట్టారే..!

డాక్టర్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త చిత్రం 'కల్కి'. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో డాక్టర్ రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపంచనుండగా... హీరోయిన్‌గా ఆదాశర్మ నటిస్తున్నారు. అయితే చిత్ర యూనిట్ తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్‌ కోసం ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ మేరకు కొత్త పోస్టర్ ద్వారా టీజర్ ముహూర్త సమయాన్ని పేర్కొన్నారు.
 
ఏప్రిల్ 10వ తేదీ ఉదయం 10 గంటల 10 నిమిషాల 10 సెకనులకు ఈ టీజర్ విడుదలవుతున్నట్లు పేర్కొనడం విశేషం. హిందూ శాస్త్రం ప్రకారం, దశావతారాల్లో 'కల్కి' 10వ అవతారం కావడం వల్లనే ఈ ముహూర్తాన్ని సెట్ చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొనడం ఇక్కడ విశేషం. ఈ సినిమా రాజశేఖర్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఈ సినిమా దర్శకనిర్మాతలు చెప్తున్నారు. మరి... 10వ తేదీన విడుదలయ్యే ఈ టీజర్ ఎంత మాత్రం ఉండనుందో చూద్దాం.