డీజే.. గుడిలో బడిలో మడిలో వడిలో పాటలోని పదాల్ని తొలగిస్తాం: హరీష్ శంకర్
బన్నీ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలోని ‘గుడిలో బడిలో మడిలో వడిలో’ అనే పాటలో వాడిన కొన్ని పదాలపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసి
బన్నీ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలోని ‘గుడిలో బడిలో మడిలో వడిలో’ అనే పాటలో వాడిన కొన్ని పదాలపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీనిపై హరీశ్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు. ‘నేనూ బ్రాహ్మణుడినే..’ నా కులాన్ని ఎందుకు కించపరుస్తాను. దయచేసి సాహిత్యాన్ని అర్ధం చేసుకోవాలని చెప్పాడు. అయితే వివాదం సద్దుమనగలేదు.
ఈ పాటలో ఉపయోగించిన అగ్రహారం, తమలపాకు అనే పదాలను తొలగించాల్సిందేనని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పట్టుబట్టడంతో ప్రస్తుతం హరీష్ వెనక్కి తగ్గాడు. ఆ పదాలను తొలగిస్తానని హరీష్ ప్రకటించాడు. ఈ పాటలో ప్రయోగించిన ‘నమక చమకాలు’, ‘ప్రవర’, ‘అగ్రహారం’తో పాటు అన్ని పదాలను తొలగిస్తామని ఆ పాట రచయిత సాహితి కూడా తెలిపాడు.
బ్రాహ్మణ సంఘం నేతలు హరీశ్ శంకర్, సాహితిలను వారి కార్యాలయంలో కలిసిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. తాము ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఈ పాటను రాయలేదని హరీశ్ శంకర్ అన్నారు.