గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2023 (10:03 IST)

మాదాపూర్ డ్రగ్స్ కేసు: హీరో నవదీప్‌‌కు నోటీసులు

Navadeep
మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.  గత నెల 23న మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌ను నార్కోటిక్స్ పోలీసులు ఆరు గంటల పాటు విచారించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరుకావాలని నవదీప్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 
 
ఇదే కేసులో ఆయనకు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు పంపినా విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా నైజీరియన్ డ్రగ్స్ ముఠాతో నవదీప్‌కు సంబంధాల విషయంలో ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు