బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (19:31 IST)

ఆర్‌.ఆర్‌.ఆర్‌. నుంచి ఎత్త‌రా జెండా పాట రాబోతోంది!

RRR song still
రాజ‌మౌళి త‌న ఆర్‌.ఆర్‌.ఆర్‌. ప్ర‌మోష‌న్ మొద‌లు పెట్టేశాడు. రోజుకొక‌టి పోస్ట‌ర్‌ను న్యూస్‌ను బ‌య‌ట‌కు వ‌దులుతున్నాడు. ఈరోజు ఎత్త‌రా జెండా అంటూ రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్‌.టిఆర్‌., ఆలియాభ‌ట్‌తో కూడిన పోస్ట‌ర్‌ను విడ‌దుల చేశాడు. మార్చి 14న విడుద‌ల అంటూ ప్ర‌క‌టించాడు. ఇప్ప‌టికే ఐమాక్స్ ఫార్మెట్‌లో సినిమా అంటూ నిన్న వెల్ల‌డించాడు.
 
ఇప్ప‌టికే ఈ సినిమా ప్ర‌పంచంలోనే ఎక్కువ స్క్రీన్‌ల‌లో ప్ర‌ద‌ర్శ‌న కాబోతోంది. విదేశాల్లోని కొన్ని భాష‌ల్లో కూడా విడుద‌ల చేస్తున్నాడు. ఇప్ప‌టికే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం అదరగొడుతుంది. ఆల్రెడీ రికార్డు స్థాయి బుకింగ్స్ ని కొల్లగొట్టిన ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 15 రోజులు మిగిలి ఉండగానే టోటల్ గా 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా ఇది రికార్డు సెట్ చేసిందట. ఇప్పటికే నెక్స్ట్ లెవెల్లో సెలెబ్రేషన్స్ అక్కడ మొదలైపోయాయి. మరి సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడేసరికి ఆర్‌.ఆర్‌.ఆర్‌. సెన్సేషన్ ఏమేర‌కు పోతుందో చూడాలి.