సంబంధిత వార్తలు
- మెస్మరైజ్ చేస్తున్న ఉన్ని ముకుందన్ మలయాళ చిత్రం మార్కో
- ఒలింపిక్ విజేత దీప్తి జీవాంజికి చిరంజీవిగారు చెక్ ఇవ్వడం సంతోషాన్నిచ్చింది
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్.. లంగా వోణీలో.. లడ్డూను టేస్ట్ చేస్తూ....? (video)
- అనిల్ రావిపూడికి నిర్మాత నాగవంశీ కి మధ్య విభేధాలు !
- రానా దగ్గుబాటి ప్రెజెంట్స్ లో డార్క్ చాక్లెట్ రాబోతుంది
నా కోసం అందరూ ప్రార్థించారు : ఉన్ని ముకుందన్
Unni Mukundan
- ఇందులో యాక్షన్ భాగాన్ని షూట్ చేస్తున్నప్పుడు నేను గాయపడకుండా చూసుకోవాలనుకున్నాను. అందరూ దాని కోసం ప్రార్థించారు. ఏదైనా గాయం అయితే షూట్ ఆగిపోతుంది. అదృష్టవశాత్తూ అన్నీ బాగానే జరిగాయి. క్యారెక్టర్ కోసం మంచి ఫిజిక్ ని రెడీ చేయాల్సి వచ్చింది. బిల్ట్‌ని మెయింటెయిన్ చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది.
-వెరీ ఓవర్వెల్మింగ్ ఫీలింగ్. చాలా హార్డ్ వర్క్ చేశాం. ఫైట్ సీక్వెన్స్ ఎప్పుడూ రిస్క్ తో కూడుకున్నవే. నేను ఎలాంటి డూప్స్ ఉపయోగించలేదు. సినిమా A సర్టిఫికేట్ పొందినందున ప్రొడక్షన్ విషయంలో కూడా చాలా రిస్క్ ఉంది, కానీ ఇప్పుడు A సర్టిఫికేట్ పొందిన సినిమాతో 100cr క్రాస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.
ఈ సినిమాను తెలుగులో విడుదల చేయాలని బలంగా అనుకున్నాను. తెలుగు ప్రేక్షకులు కొత్తదనంను ఆదరిస్తారు. బాహుబలి, ఈగ.. ఇలా రాజమౌళి సర్ తీసిన సినిమాలు హై టైమ్ ప్రయోగాలే అయినా ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. ఇలాంటి సినిమా తీయడానికి అదొక స్ఫూర్తి. తెలుగు ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు. త్వరలో మరో సినిమాతో మీ ముందుకు వస్తాను అన్నారు.
