బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 13 నవంబరు 2023 (10:31 IST)

ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ దీపావళి పోస్టర్ - త్వరలో ఫస్ట్ సింగిల్ విడుదల

Family star deevali poster
Family star deevali poster
స్టార్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా "ఫ్యామిలీ స్టార్" నుంచి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు మూవీ టీమ్. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 54న సినిమా ఇది. "ఫ్యామిలీ స్టార్" చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు.
 
"ఫ్యామిలీ స్టార్" సినిమా నుంచి దీపా‌వళి శుభాకాంక్షలతో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ క్రాకర్స్ కాల్చుతూ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "ఫ్యామిలీ స్టార్" సినిమా సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది.