బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 6 మే 2024 (19:26 IST)

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Ramcharan
Ramcharan
రామ్ చరణ్ ప్రతిష్టాత్మక శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ క్లయిమాక్స్ లో వుంది. ఇప్పటికే రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రస్తుతతం చెన్నైలో షూట్ జరుగుతున్న ఈ సినిమా ప్రమోషన్ వినూత్నంగా చేయాలని సంకల్పించారు.  తాజా అప్ డేట్ ప్రకారం,   సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ సినిమాను  ప్రమోట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 
 
ప్రమోషన్లకు సంబంధించి టీమ్ ను ఏర్పాటు చేశారు. అన్ని రకరాల మాద్యమాలలో ఆసక్తికరమైన పబ్లిసిటీతో గేమ్ చేంజర్ తారాగణం కూడా పాల్గొనున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర కూడా  ప్రమోషన్స్ లో పాల్గొనేలా షెడ్యూల్ తయారుచేసుకున్నారట.