గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (19:21 IST)

గంగవ్వా మజాకా.. ర్యాంప్ పైన నడిచి బంగారు నగలను సంపాదించింది.. ఎలా? (video)

గంగవ్వ ఈమె గురించి అస్సలు పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ షో నుంచి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో బయటకు వచ్చేసింది. కానీ ఇప్పుడు మాత్రం గంగవ్వ బయట ఉన్నా బాగా చలాకీగా కనిపిస్తోంది. ఒంటి నిండా నగలతో ఫోటోలకు ఫోజులిస్తోంది.
 
అసలు గంగవ్వకు ఉన్నట్లుండి ఇంత డబ్బు ఎలా వచ్చిందని కూడా ఆశ్చర్యపోవచ్చు. గంగవ్వ షాపింగ్ చేయడానికి కారణం బిగ్ బాస్ షోనే. గంగవ్వ హౌస్‌లో ఉండగా చందన బ్రదర్స్ వారి సౌజన్యంతో ఫ్యాషన్ షో నిర్వహించారు.
 
చందన బ్రదర్స్ వారి బట్టలు ధరించిన ఇంటి సభ్యులు ర్యాంప్ వాక్ చేశారు. ఈ ఫ్యాషన్ షోలో విజేతలకు లక్ష రూపాయల బహుమతి ప్రకటించారు. గంగవ్వ ఇందులో గెలుపొందడంతో ఆమెకు లక్షరూపాయల చెక్కును ఇచ్చారు. ఆ చెక్కును గంగవ్వ వారికే ఇచ్చేసింది.
 
అంతేకాదు ఆ డబ్బుకు సరిపడా కాసుల హారాన్ని మెడలో వేసుకుని ఫోటోలకు ఫోజులిస్తోంది. ఇప్పుడు ఈమె ఫోటోలే హాట్ టాపిక్ అవుతున్నాయి. గంగవ్వ మజాకా అంటూ నెటిజన్లు తెగ మెసేజ్‌లు చేసేస్తున్నారు.