మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (16:28 IST)

హీరో ల‌క్ష్ న‌టించిన గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు

Gangster Gangaraju
`వ‌ల‌యం` త‌ర్వాత హీరో ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ `గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు` అనే డిఫ‌రెంట్ మూవీతో ఆక‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. మంగ‌ళ‌వారం ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఫ‌స్ట్‌లుక్‌ను గ‌మ‌నిస్తే సీరియ‌స్‌గా చూస్తున్న ప‌హిల్వాన్స్‌ వారి మ‌ధ్య‌లో కూల్‌గా స్టైల్‌గా కొబ్బ‌రి బొండం తాగుతూ కూర్చున్న‌హీరో ల‌క్ష్..క‌నిపిస్తున్నారు. లుక్ చూస్తుంటే ల‌క్ష్ త‌న‌ పాత్ర కోసం ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ బాగానే అయ్యార‌నేది తెలుస్తుంది. అలాగే త‌న లుక్ కూడా డిఫ‌రెంట్‌గా ఉంది. క‌థానాయ‌కుడి పాత్ర స‌రికొత్త డైమ‌న్ష‌న్‌లో ఉంటుంద‌ని లుక్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. 
 
ప్రముఖ నిర్మాణ  సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్  పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుగుతోంది. ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌కు సంగీతాన్నందించిన యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయికార్తీక్  ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. తొలి సాంగ్‌ను వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.