గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : బుధవారం, 16 నవంబరు 2016 (11:14 IST)

పెద్ద నోట్ల రద్దు సినిమా కలెక్షన్లపై ప్రభావముంది: గౌతమ్‌ మీనన్‌

పెద్ద నోట్ల రద్దు అంశంతో పాటు.. మార్పిడి వ్యవహారం చాలా ఇబ్బందికరంగా మారిందనీ, సినిమాలకు ఇది వర్తించకుండా కాస్త వెసులుబాటు ఇవ్వాలని ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ కోరారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'స

పెద్ద నోట్ల రద్దు అంశంతో పాటు.. మార్పిడి వ్యవహారం చాలా ఇబ్బందికరంగా మారిందనీ, సినిమాలకు ఇది వర్తించకుండా కాస్త వెసులుబాటు ఇవ్వాలని ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ కోరారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ చిత్రం విడుదల ఆలస్యమైనా కోట్లు ఖర్చుపెట్టి నిర్మాత తీశారు. 
 
అప్పటికే ఓవర్‌సీస్‌ ప్రింట్లు కూడా వెళ్లిపోయాయి. ముందుగా అనుకున్నడేట్‌ ఈనెల 11న. కానీ అప్పటికి మూడురోజుల ముందే మోడీ చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగించింది. ఈ సినిమాకు అనుకున్నంత వసూళ్ళురాలేదు. అందరూ నోట్లను వెతుక్కోవడంతోనే సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇంకా వినోదం కోసం సమయాన్ని కేటాయించే వ్యవధి వారికి లేదు. ప్రభుత్వానికి వినోదపు పన్నుకూడా కడుతున్న నిర్మాతల కష్టాలను చూడాలని ఆయన కోరారు.