1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 6 అక్టోబరు 2018 (16:55 IST)

సార్.. నాన్నగారిపై ఉన్న అభిమానంతోనే ఆస్తులమ్మి సినిమా తీశాం.. సహకరించండి...

అమరగాయకుడు స్వర్గీయ ఘంటసాల తనయుడు ఘంటసాల రత్నకుమార్‌కు ఘంటసాల జీవిత చిత్రను తెరకెక్కించిన నిర్మాతలు ఓ విజ్ఞప్తి చేశారు. సార్.. నాన్నగారిపై ఉన్న అభిమానంతోనే ఆస్తులమ్మి ఈ చిత్రాన్ని నిర్మించాం.. ఇపుడు మీరు మాకు సహకరించాలంటూ ఆయన కోరారు.
 
తెలుగులో అమరగాయకుడు ఘంటసాల జీవితచరిత్ర ఆధారంగా ఓ చిత్రం రానుంది. ఈ చిత్రానికి సీహెచ్.రామారావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఘంటసాల దంపతులుగా గాయకుడు కృష్ణచైతన్య.. ఆయన భార్య మృదుల నటించారు. ఈనెల 13వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. 
 
అయితే, తమ అనుమతి తీసుకోకుండా 'ఘంటసాల'గారి జీవితచరిత్రను రూపొందించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఘంటసాల తనయుడు రత్నకుమార్ పత్రికాముఖంగా హెచ్చరించారు. 
 
దాంతో 'ఘంటసాల' బయోపిక్ చిత్ర యూనిట్ శనివారం హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ చాంబర్లో మీడియా ముందుకు వచ్చింది. ఘంటసాలగారి పట్ల అభిమానంతోనే ఈ సినిమా తీశామనీ.. అందుకోసం ఆస్తులు అమ్మేశామని నిర్మాతలు చెప్పారు. ఘంటసాల కుటుంబ సభ్యులు తమకి మద్దతివ్వాలని వారు ప్రాధేయపడ్డారు. 
 
కాగా, ప్రస్తుతం తెలుగులో బయోపిక్‌ల కాలం నడుస్తోంది. మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా 'మహానటి' చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్, కాంతారావు బయోపిక్‌‌ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కోవలోనే ఘంటసాల బయోపిక్‌ను నిర్మించారు.