శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Updated : బుధవారం, 29 ఆగస్టు 2018 (20:46 IST)

వివాదంలో నాగ‌శౌర్య @న‌ర్త‌న‌శాల‌.!

యువ హీరో నాగ‌శౌర్య న‌టించిన తాజా చిత్రం @న‌ర్త‌న‌శాల‌. ఈ చిత్రం ద్వారా శ్రీనివాస చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌కుడుగా ప‌రిచయం అవుతున్నాడు. ఈ నెల 30న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే... ఈ సినిమాలో ట్రై

యువ హీరో నాగ‌శౌర్య న‌టించిన తాజా చిత్రం @న‌ర్త‌న‌శాల‌. ఈ చిత్రం ద్వారా శ్రీనివాస చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌కుడుగా ప‌రిచయం అవుతున్నాడు. ఈ నెల 30న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే... ఈ సినిమాలో ట్రైల‌ర్‌లో నాగ‌శౌర్య తండ్రి పాత్ర పోషించిన శివాజీరాజా త‌న కొడుకు గే నా అంటాడు. ఇప్పుడు ఇదే వివాద‌స్ప‌దం అయ్యింది. అవును.. @నర్తనశాల చిత్రంపై హిజ్రాలు నిరసన వ్యక్తం చేశారు. తమ మనోభావాలను కించపరిచేలా ఇందులో సన్నివేశాలు ఉన్నాయంటూ ఫిల్మ్ ఛాంబర్‌ను ముట్టడించారు. 
 
ఈ చిత్రంలోని ఆ సన్నివేశాలను వెంట‌నే సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే సినిమా విడుదల అడ్డుకుంటామన్నారు. ఆందోళన చేస్తున్న హిజ్రాలతో శివాజీ రాజా మాట్లాడారు. వారి కోసం @నర్తనశాల సినిమాను ప్రత్యేక ప్రదర్శన వేయిస్తామని, అభ్యంతరకర సన్నివేశాలు తొలగించేందుకు నిర్మాతలతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. దీంతో హిజ్రాలు అక్క‌డ నుంచి వెళ్లిపోయారు.