శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: బుధవారం, 29 ఆగస్టు 2018 (15:02 IST)

@న‌ర్త‌న‌శాల టైటిల్ ఎందుకు పెట్టారో తెలిస్తే షాక్ అవుతారు..!

ఛ‌లో అనే స‌క్స‌స్ ఫుల్ మూవీ త‌రువాత నాగ‌శౌర్య న‌టించిన చిత్రం @న‌ర్త‌న‌శాల‌. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్లో ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా రూపొందిన @న‌ర్త‌న‌శాల‌కు ఫ‌స్ట్ నుంచి పాజిటివ్ టాక్ ఉంది. సోష‌ల్ మీడియాలో ఫ‌స్ట్ లుక్ & ట్రైల‌ర్‌కి విప‌రీత‌మైన రెస్పాన్స్

ఛ‌లో అనే స‌క్స‌స్ ఫుల్ మూవీ త‌రువాత నాగ‌శౌర్య న‌టించిన చిత్రం @న‌ర్త‌న‌శాల‌. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్లో ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా రూపొందిన @న‌ర్త‌న‌శాల‌కు ఫ‌స్ట్ నుంచి పాజిటివ్ టాక్ ఉంది. సోష‌ల్ మీడియాలో ఫ‌స్ట్ లుక్ & ట్రైల‌ర్‌కి విప‌రీత‌మైన రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై మ‌రింత క్రేజ్ పెరిగింది. ఈ చిత్రంలో క‌ష్మిర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్ హీరోయిన్స్‌గా న‌టించారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రానికి నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీనివాస చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
 
ఈ మూవీ ప్ర‌మోష‌న్లో భాగంగా నాగ‌శౌర్య మీడియాతో మాట్లాడుతూ... ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట పెట్టాడు. అది ఏంటంటే... ఈ చిత్రానికి @న‌ర్త‌న‌శాల అనే టైటిల్ పెట్ట‌డం వెన‌కున్న సీక్రెట్. అవును.. టైటిల్ వెన‌క ఓ సీక్రెట్ ఉంద‌ట‌. ఇంత‌కీ ఆ సీక్రెట్ ఏంటంటే.. న‌ర్త‌న‌శాల టైటిల్‌తో సినిమా చేయాల‌నుకున్న చాలా సినిమాలు ఆగిపోయాయి. అందుచేత ఈ సినిమాకి న‌ర్త‌న‌శాల అనే టైటిల్ పెట్ట‌డం క‌న్నా@న‌ర్త‌న‌శాల అని పెడితే బాగుంటుంద‌ని నాగ‌శౌర్య‌కి వాళ్ల ఫాద‌ర్ చెప్పార‌ట‌. 
 
అంతేకాకుండా.. ఈ మూవీ స్టోరీకి క‌రెక్ట్‌గా స‌రిపోయే టైటిల్ ఇదే. అందుకే ఈ టైటిల్ పెట్టామ‌ని చెప్పాడు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ మూవీ ఈ నెల 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. మ‌రి.. ఛ‌లో చిత్రంతో సూప‌ర్ స‌క్స‌ెస్ సాధించిన ఈ యువ హీరో @న‌ర్త‌న‌శాల‌తో ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తాడో చూడాలి.