సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 29 ఆగస్టు 2018 (14:15 IST)

హరికృష్ణ మృతిపై సమంత ట్వీట్... ట్రోల్ చేసిన నెటిజన్లు...

నటుడు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో ఈ రోజు ఉదయం మరణించారు. ఈ దుర్ఘటనపై సినీ ఇండస్ట్రీకి చెందిన ఎందరో ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన మృతిపై సంతాపాన్ని తెలియజేస్తున్నారు. సినీ నటి సమంత కూడా హరికృష్ణ మృతిపై సంతాపాన్ని తెలుపుతూ ట్విట్టర్లో ఓ ట్వీట్ చేసింది. ఐ

నటుడు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో ఈ రోజు ఉదయం మరణించారు. ఈ దుర్ఘటనపై సినీ ఇండస్ట్రీకి చెందిన ఎందరో ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన మృతిపై సంతాపాన్ని తెలియజేస్తున్నారు. సినీ నటి సమంత కూడా హరికృష్ణ మృతిపై సంతాపాన్ని తెలుపుతూ ట్విట్టర్లో ఓ ట్వీట్ చేసింది. ఐతే ఆమె చేసిన ట్వీట్ పైన నందమూరి అభిమానులు ట్రోల్ చేశారు.
 
'రిప్ హరికృష్ణ' (రెస్ట్ ఇన్ పీస్ హరికృష్ణ) అంటూ సమంత చేసిన ట్వీట్‌ పైన నందమూరి అభిమానులు మండిపడుతూ... పెద్దవారిని గౌరవించడం నేర్చుకో... అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీనితో ఆమె ముందుగా పోస్ట్ చేసిన ట్వీట్‌ను డిలిట్ చేసి ఆ తర్వాత కొత్తగా 'రిప్ హరికృష్ణ గారూ' అంటూ మరో ట్వీట్‌‌ను పోస్ట్ చేసింది. ఐతే అప్పటికే ఆమె ట్వీటును స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసి ట్రోల్ చేసేశారు.