సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 21 జులై 2018 (19:15 IST)

అమ్మవద్దే అమ్మాయిలందరికీ ఐ లవ్ యూ అన్న నాగశౌర్య(video)

ఐ లవ్ యూ... ఈ మాట చెప్పాలంటే గుండెల్లో దడ పుట్టేది ఇదివరకు. ఇప్పుడిది క్యాజువల్ వర్డ్ అయిపోయిందనుకోండి. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే అభిమానులు వచ్చినప్పుడు వారికి ఐ లవ్ యూ అని చెప్పకపోతే విమర్శలు ఏ స్థాయిలో వుంటాయో వేరే చెప్పక్కర్లేదు. అందువల్ల ఏ ఈవ

ఐ లవ్ యూ... ఈ మాట చెప్పాలంటే గుండెల్లో దడ పుట్టేది ఇదివరకు. ఇప్పుడిది క్యాజువల్ వర్డ్ అయిపోయిందనుకోండి. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే అభిమానులు వచ్చినప్పుడు వారికి ఐ లవ్ యూ అని చెప్పకపోతే విమర్శలు ఏ స్థాయిలో వుంటాయో వేరే చెప్పక్కర్లేదు. అందువల్ల ఏ ఈవెంటుకు వచ్చినా సెలబ్రిటీలు చక్కగా ఫ్లయింగ్ కిసెస్, ఐ లవ్ యూ అని గట్టిగా అరిచి మరీ చెప్తారు. దాంతో ఫ్యాన్స్ కూడా హేపీగా ఎంజాయ్ చేస్తారు. 
 
ఇక అసలు విషయానికి వస్తే... నాగశౌర్య నటిస్తున్న నర్తనశాల చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదు సెంట్రల్‌లో జరిగింది. అక్కడికి పెద్దఎత్తున బోయ్స్ అండ్ గాళ్స్ వచ్చారు. వారిలో కొందరిని పిలిచి వారి సమక్షంలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు నాగశౌర్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అమ్మాయిలందరికీ ఐ లవ్ యూ... అబ్బాయిలకు మాత్రం ఐ లైక్ యూ అంటూ చెప్పేశాడు. ఇకపోతే ఏ పని చేసినా తన తల్లితో ప్రారంభిస్తానని నాగశౌర్య చెప్పుకొచ్చాడు. చూడండి ఈ వీడియోను..