మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 20 జులై 2018 (20:37 IST)

జర్నలిస్టులపై దిల్‌రాజు వ్యంగ్యాస్త్రాలు... ఎదురుతిరిగిన జర్నలిస్టులు(video)

నిర్మాత దిల్‌రాజుకు జర్నలిస్టులపై అవ్యాజమైన ప్రేమ వుంది. అది పలుసార్లు శ్రుతిమించింది కూడా. తాను చెప్పిందే రాసుకోండంటూ.. ఆర్టిస్టులు, ఇతర టెక్నీషియన్లను కూడా ప్రెస్‌మీట్లకు పిలకుండా అన్నీ తానే చెప్పేస

నిర్మాత దిల్‌రాజుకు జర్నలిస్టులపై అవ్యాజమైన ప్రేమ వుంది. అది పలుసార్లు శ్రుతిమించింది కూడా. తాను చెప్పిందే రాసుకోండంటూ.. ఆర్టిస్టులు, ఇతర టెక్నీషియన్లను కూడా ప్రెస్‌మీట్లకు పిలకుండా అన్నీ తానే చెప్పేస్తాడు. ఇదికాకుండా ఆయన కోసం రెండుగంటల పాటు ఎదురుచూడాల్సి వస్తుంది కూడా. ఇటీవలే 'లవర్‌' సినిమా ప్రమోషన్‌లోనే తను అలాగే చేశాడు. ఒకరిద్దరు మినహా వారెవరూ ఆయన్ను ఏంటీ లేటు సార్‌! అని అడగలేకపోయారు. దీనికి సమాధానంగా.. ఏమయ్యా! మీరు చెప్పలేదా.. వీరికి కరెక్ట్‌ టైమ్‌ అంటూ.. సరిగ్గా చెప్పండయ్యా! అంటూ.. 'సీతమ్మవాకిట్లో...' సినిమాలో రావు రమేష్‌ తరహాలో పిఆర్‌ఓకు చెబుతూ దిల్‌ రాజు మాట్లాడారు. 
 
ఇక 'లవర్‌' సినిమా ఈ రోజే విడుదలైంది. మీడియాకు ఎర్రగడ్డలోని గోకుల్‌ థియేటర్లో ప్రదర్శించారు. 11.30 గంటలకు సినిమా అయినా.. ప్రేక్షకులు ఎవ్వరూ రాకపోగా.. వచ్చిన మీడియాకు అసలు సినిమా వుందా!లేదా! అనే అనుమానం కూడా కలిగింది. దాదాపు సగం థియేటర్‌ ఖాళీ. సినిమా మొదలయింది. పావుగంట అయ్యేసరికి కరెంట్‌ పోయింది. అలా పోయిన కరెంట్‌ ఒంటిగంట వరకు రాలేదు. జనరేటర్‌లో టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ అనడంతో అందరూ బయటకు వచ్చేశారు. ఈలోగా చిన్న ట్విస్ట్‌ జరిగింది. 
 
బయటకు వచ్చిన జర్నలిస్టులు కొద్దిమంది.. పీఆర్‌ఓను.. సినిమాలో జర్నలిస్టు గురించి విమర్శిస్తూ మాట్లాడిన ఓ డైలాగ్‌ వుంది. దాని గురించి అతన్ని అడిగితే... నన్నేం చేయమంటారు.. ఆయన చూసేకదా! సినిమా రిలీజ్‌ చేసేదని.. తప్పుకున్నాడు. అంతేకాకుండా అది క్రైమ్‌ రిపోర్టర్ల గురించి అన్నమాటలని.. సర్దిచెప్పాడు. అంటే... వారు కూడా వాస్తవాన్ని రాయకుండా ఏదిపడితే అది రాస్తారా! అని ఎదురు ప్రశ్నించగానే... అక్కడినుంచి పిఆర్‌ఓ తప్పుకున్నాడు. 
 
ఇంతకీ.. ఆ డైలాగ్‌ ఏమంటే.. సుబ్బరాజు.. ఓ జర్నలిస్టును మోకాళ్ళపై తాళ్ళతో కట్టేసి... జర్నలిస్టు అంటే ఏమనుకుంటున్నావ్‌రా!.. ఏదో రాసేసి డబ్బులు తీసుకువెళ్ళి ఇంటికి పట్టుకెళ్ళాలి కానీ.. ఏది బడితే అది రాసేస్తే ప్రాణం వుంటుందనుకుంటున్నావా! అని ఓ జర్నలిస్టు పాత్రధారిని తిట్టి కాల్చేచేస్తాడు. ఇది సినిమా వరకే.. గతంలో దిల్‌ రాజు బాహాటంగానే జర్నలిస్టుల్ని విమర్శించారు. గతంలో 'ఎవడు' అనే సినిమా ప్రమోషన్‌కు దస్‌పల్లా హోటల్‌లో నియమత సమయానికి కన్నా రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు. 
 
అప్పుడు 'ఇంత ఆలస్యమేమిటి సార్‌! అని మీడియా వారు అడిగితే.. ఏం రాస్తారయ్యా మీరు.. పెట్టింది తినేసి వెళ్ళిపోక! అంటూ వ్యగ్యంగా మాట్లాడారు. దాంతో కొంతమంది బాయ్‌కాట్‌ చేశారు. ఆ తర్వాత మీడియాలో కొందరిని పిలిచి.. వారికి మంచిమార్యాదలు చేసి పంపడమే కాకుండా.. మీరు నాతో సరదాగా వుంటారు గనుక నేనట్లా మాట్లాడాను.. అంటూ సరిదిద్దుకున్నారు. సో... 'దిల్‌' తనకు బాగా వుందనుకునే రాజు ఉదంతమిది. ఇకపోతే లవర్స్ సక్సెస్ గురించి దిల్ రాజు ఏమంటున్నారో చూడండి..