శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 1 జులై 2018 (10:21 IST)

''యూటర్న్'' కోసం ''మహానటి'' జడను కత్తిరించుకున్నా: సమంత

''యూటర్న్'' సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా హీరోయిన్ సమంత అక్కినేని ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. అక్కినేని వారసుడు నాగ చైతన్యతో వివాహం తరువాత కూడా సినిమాల్లో తన కెరీర్

''యూటర్న్'' సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా హీరోయిన్ సమంత అక్కినేని ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. అక్కినేని వారసుడు నాగ చైతన్యతో వివాహం తరువాత కూడా సినిమాల్లో తన కెరీర్‌ను కొనసాగిస్తూ, సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటున్న సమంత.. ప్రస్తుతం యూటర్న్ సినిమా ప్రమోషన్‌లో బిజీబిజీగా వుంది. 
 
యూటర్న్ సినిమాలో తాను ఓ జర్నలిస్టు పాత్ర పోషిస్తున్నట్లు సమతం తెలిపింది. వరుసగా జర్నలిస్టు పాత్రల్లో కనిపించినా బోర్ కొట్టలేదని చెప్పింది. ''మహానటి''లో 30 సంవత్సరాల క్రితం మహిళా విలేకరి పాత్రను పోషించానని, ఆ పాత్ర కోసం జడ వేసుకున్నానని, తాజాగా మోడ్రన్ లేడీ జర్నలిస్టుగా నటిస్తున్నందున హెయిర్ స్టయిల్‌ను మార్చుకుని షార్ట్‌గా కట్ చేయించుకున్నానని చెప్పింది. 
 
చైతూ తాను ఆన్ స్క్రీన్ మీద ఆర్టిస్టులం కాబట్టి, ఆఫ్ స్క్రీన్‌లో రియాలిటీలో బతకాలన్నది తమ ఆలోచనని తెలిపింది. టాటూలు తన భర్తకు గుర్తుగా వేయించుకుంటున్నవేనని సమంత చెప్పింది.