శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 19 జులై 2018 (17:24 IST)

ప్రియురాలిని ఆరుగురితో రేప్ చేయించిన ప్రియుడు.. ఎక్కడ?

ప్రేమ పేరుతో నమ్మించి ఓ ప్రియుడు తన ప్రియురాలిని ఆరుగురు స్నేహితులతో కలిసి రేప్ చేశాడు. ఈ దారుణం పుదుచ్చేరిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

ప్రేమ పేరుతో నమ్మించి ఓ ప్రియుడు తన ప్రియురాలిని ఆరుగురు స్నేహితులతో కలిసి రేప్ చేశాడు. ఈ దారుణం పుదుచ్చేరిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తమిళనాడు రాష్ట్రంలోని విలుపురం జిల్లా వళుదావూర్‌కు చెందిన 17 యేళ్ళ బాలికకు స్థానికంగా ఉండే ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సినిమాలకు షికార్లకు తిప్పాడు. దీంతో ఆ బాలిక అతన్ని గుడ్డిగా నమ్మేసింది.
 
ఈ నేపథ్యంలో సినిమా పేరుతో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తన ఆరుగురు స్నేహితులను పిలిపించి అత్యాచారం చేయించాడు. ఆ తర్వాత ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, వాటిని చూపించి భయపెట్టి, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. 
 
ఆమె నిస్సహాయతను ఆసరా చేసుకొని తన ఆరుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం జరిపాడు. బాధితురాలు వారి ఆగడాలను భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.