ఘాజీకి సెన్సార్ సర్టిఫికేట్.. మూవీ మేకింగ్ వీడియో చూడండి..
తెలుగు, తమిళ, హిందీల్లో రిలీజ్ కానున్న ఘాజీ సినిమాకి సెన్సార్ యు సర్టిఫికేట్ ఇచ్చేసింది. రానా- తాప్సీ- మీనన్- అతుల్ కులకర్ణి- రాహుల్‌సింగ్ కాంబోలో రానున్న ఈ సినిమా ప్రమోషన్ మొదలెట్టింది. తాజాగా మేకింగ
తెలుగు, తమిళ, హిందీల్లో రిలీజ్ కానున్న ఘాజీ సినిమాకి సెన్సార్ యు సర్టిఫికేట్ ఇచ్చేసింది. రానా- తాప్సీ- మీనన్- అతుల్ కులకర్ణి- రాహుల్‌సింగ్ కాంబోలో రానున్న ఈ సినిమా ప్రమోషన్ మొదలెట్టింది. తాజాగా మేకింగ్ వీడియో విడుదలైంది. దీనికి సంబంధించి ఎక్స్‌పీరియెన్స్‌ను యూనిట్ సభ్యులు పంచుకున్నారు. 1970లో భారత్-పాకిస్థాన్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఘాజీని పీవీపీ - మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
భారత్‌లో మొట్టమొదటి సబ్ మెరైన్ హిస్టారికల్ వార్ సినిమా ఘాజీ. రానా, తాప్సీ, అతుల్ కులకర్ణి తదితరులు నటించారు. ఈ సినిమా షూటింగులో ఎన్నో కష్టనష్టాలకోర్చి తెరకెక్కించారు. ఘాజీ సబ్‌మెరైన్ సెట్ వేసి అందులో మొత్తం మెజారిటీ పార్ట్ షూటింగ్ చేశారు. సబ్ మెరైన్‌కి డ్యామేజ్ జరిగి సముద్రపు నీరు లోనికి వచ్చేస్తే అందులో ఉన్న క్రూ ఎలాంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నారు. అడుగడుగునా శత్రువుల నుంచి ఎదురయ్యే దాడుల్ని మన నావీ బృందం ఎలా ఎదుర్కొంది? వంటి విషయాల్ని ఆసక్తికరంగా చూపించారు.
ఈ సినిమాకి మదీ కెమెరా వర్క్ అద్భుతంగా పనిచేసిందని, అంతర్జాతీయ స్థాయి లుక్ తెచ్చిందని హీరో రానా చెబుతున్నారు. ఇలాంటి ఓ సంక్లిష్టమైన సబ్జెక్టుని ఎంచుకున్నప్పుడు కన్వే చేసేలా తెరకెక్కించకపోతే జనం చూడరని రానా అంటున్నాడు. సంకల్ప్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా ఘాజీ మేకింగ్ వీడియోని మీడియాకి రిలీజ్ చేశారు.