ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ వారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్
తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన హారిత హారం (గ్రీన్ ఇండియా ఛాలెంజ్) పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రజలను జాగృతం చేస్తున్నాయి. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ''ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్'' ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి రోజు పండగే టీమ్‌తో పాటు మేయర్ బొంతు రామ్మెహన్, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌లతో బంజారాహిల్స్‌లోని శ్రీనికేతన్ కాలనీ పార్క్‌లో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించారు.
ఈ సందర్బంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. హీరో సాయి ధరమ్ తేజ్ కూడా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం సాయి ధరమ్ తేజ్ మాట్లాడారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం తనను ఎంతగానో ఆకర్షించిందని అన్నారు. ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో తనను భాగం చేసినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.
ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. అలాగే హీరోయిన్ రాశీ ఖన్నా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. కాగా ఈ కార్యక్రమంలో సహా నిర్మాత ఎస్కేఎన్, ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు రాంబాబు, శేఖర్, ప్రధాన కార్యదర్శి నాయుడు, కాలనీ వాసులు పాల్గొన్నారు.