శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2019 (17:21 IST)

అలీ తల్లి జైతు మృతి.. చిరంజీవి, పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి

ప్రముఖ హాస్యనటుడు అలీ తల్లి జైతును బీబీ మృతిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలీ తల్లి కన్నుమూశారని వార్త తెలిసి బాధపడ్డానని, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అలీకి తన తల్లితో ఉన్న అనుబంధం ఎంత బలమైందో తనకు తెలుసని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. 
మరోవైపు అలీ తల్లి జైతున్ బీబీ పార్దివ దేహాన్ని మెగాస్టార్ చిరంజీవి సందర్శించారు. కన్నీటి సంద్రంలో మునిగిపోయిన అలీని పరామర్శించారు. బీబీ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. తన తల్లి చనిపోయినప్పుడు అలీ షూటింగ్ నిమిత్తం జార్ఖండ్‌లో ఉన్నారు. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న తన తల్లి ఇక లేదని తెలిసి అలీ కన్నీరుమున్నీరయ్యారు.