గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2019 (16:52 IST)

భారత్‌కు వచ్చే ఆస్ట్రేలియా జట్టు ఇదే...

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వచ్చే యేడాది భారత పర్యటనకు రానుంది. ఇందుకోసం క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఈ జట్టులో గ్లెన్ మాక్స్‌వెల్, నాథన్ లైయన్, మార్కస్ స్టాయినీస్‌లతో సహా ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్లను సీఏ ఎంపిక బోర్డు పక్కనపెట్టేసింది. ముఖ్యంగా, టీమిండియాతో జరిగే వన్డే సిరీస్ కోసం రెగ్యులర్ ఆటగాళ్లను పక్కనబెట్టి 14 మందితో కూడిన నూతన జట్టును సెలక్టర్లు ప్రకటించారు. 
 
కాగా, భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన జనవరి 14 నుంచి ప్రారంభమవుతుంది. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని సెలక్టర్లు స్పష్టం చేశారు. ఈ జాబితాలో బెహ్రెన్‌డార్ఫ్, నాథన్ కౌల్టర్ నీల్, ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, రిచర్డ్‌సన్‌లకు ఆసీసీ క్రికెట్ బోర్డు ఉద్వాసన పలికింది. 
 
వారి స్థానంలో గత కొద్దిరోజులుగా మెరుగైన ప్రదర్శన చేస్తున్న మార్నస్ లబుషేన్ వంటి ప్రతిభావంతులకు చోటు కల్పించారు. సూపర్ ఫామ్‌లో ఉన్న లబుషేన్ న్యూజిలాండ్‌తో తొలి టెస్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ భారత్ పర్యటన నుంచి తప్పుకున్నారు. అతని స్థానంలో అసిస్టెంట్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ భారత్ పర్యటనలో ఆసీస్ జట్టుకు మార్గనిర్దేశనం చేయనున్నాడు.
 
జట్టు వివరాలు...  
అరోన్ ఫించ్(కెప్టెన్), సీన్ అబాట్, ఆష్టన్ అగార్, అలెక్స్ కేరీ, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, పీటర్ హాండ్స్‌కాంబ్, మార్నస్ లబుషేన్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆష్టన్ టర్నర్, డేవిడ్ వార్నర్, ఆడం జంపా.