శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 31 డిశెంబరు 2018 (14:55 IST)

రోహిత్ శర్మ తండ్రి అయ్యాడు.. పండంటి పాపాయికి జన్మనిచ్చిన రితిక

భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ తండ్రి అయ్యాడు. రోహిత్ శర్మ భార్య రితిక ఆదివారం ముంబైలోని ఓ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. రోహిత్ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించిందంటూ సొహైల్ ఖాన్ భార్య, రితికాకు బంధువు అయిన సీమా ఖాన్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు.


ఇక ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రోహిత్ ప్ర‌స‌వ స‌మ‌యంలో భార్య ప‌క్క‌న ఉండేందుకు భార‌త్ ప‌య‌న‌మ‌య్యాడు. దీంతో ఆస్ట్రేలియాతో జ‌రుగ‌నున్న నాలుగో టెస్ట్‌కు రోహిత్ దూరం కానున్నాడు.  
 
కాగా దాదాపు తొమ్మిది నెలలు తర్వాత భారత టెస్టు జట్టులోకి ఇటీవల పునరాగమనం చేసిన రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 38 పరుగులతో నిరాశపరిచాడు. ఆ టెస్టులో గాయం కారణంగా పెర్త్‌లో జరిగిన రెండో టెస్టుకి దూరమైన ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్.. ఆదివారం మెల్‌బోర్న్‌లో ముగిసిన మూడో టెస్టులో మాత్రం 63 నాటౌట్, 5 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే.