గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2019 (09:38 IST)

హాస్య నటుడు అలీకి మాతృవియోగం

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్య నటుడు అలీ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి జైతున్ బీబీ అనారోగ్యంతో కన్నుమూశారు. రాజమండ్రిలోని ఆమె స్వగృహంలోనే ఆమె చనిపోయారు. తల్లి మరణవార్త తెలుసుకున్న అలీ.. హుటాహుటిన తన షూటింగ్ స్పాట్ రాంచీ నుండి హైద‌రాబాద్‌కి బయలుదేరారు. 
 
మరోవైపు, జైతున్ బీబీ పార్దివ దేహాన్ని రాజ‌మ‌హేంద్ర‌వరం నుండి హైద‌రాబాద్‌కి తీసుకొచ్చేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం హైద‌రాబాద్‌లో ఆమె అంత్య‌క్రియ‌లు జ‌ర‌ప‌నున్న‌ట్టు తెలుస్తుంది. అలీకి త‌న త‌ల్లి తండ్రులంటే అమిత‌మైన ప్రేమ‌. వారి వ‌ల్ల‌నే త‌ను ఈ స్థాయిలో ఉన్నాన‌ని అనేక సార్లు చెబుతుంటాడు. త‌న తండ్రి పేరు మీద ఇప్ప‌టికే అనేక సేవా కార్య‌క్ర‌మాలను అలీ చేస్తున్న విషయం తెల్సిందే.