శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (19:00 IST)

అయోగ్య వచ్చేస్తోంది.. టెంపర్ రీమేక్‌.. వసూళ్లను రాబడుతుందా?

తెలుగులో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ''టెంపర్''కు రీమేక్‌గా తెరకెక్కుతున్న తమిళ సినిమా అయోగ్య. పందెంకోడి విశాల్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.


వెంకట్‌ మోహన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మే 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ‘ఠాగూర్‌’ మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 
తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేసిన టెంపర్ సినిమా మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయగా అక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఇదే తరహాలో అయోగ్యతో టెంపర్‌ను రీమేక్ చేయాలనుకున్నాడు విశాల్.

ఫలితంగా విశాల్ హీరోగా ఈ సినిమా 'అయోగ్య' పేరుతో నిర్మితమైంది. ఈ సినిమా తమిళ తంబీలను కూడా బాగా ఆకట్టుకుంటుందని అయోగ్య టీమ్ భావిస్తోంది.