సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (18:11 IST)

మార్కెట్‌లో మాగబెట్టిన మామిడి.. తిన్నారో అంతే సంగతులు!

మార్కెట్‌లో పండ్లు చూడటానికి తాజాగానే ఉంటాయి. కానీ మన కళ్లే మనల్ని మోసం చేస్తాయి. మనం కొనుగోలు చేసే పండ్లు ఏవి మంచివి, ఏవి నకిలీవో కనిపెట్టడం కష్టం. కార్బైడ్ రసాయనాలతో మాగబెట్టిన పండ్లను యధేచ్చగా విక్రయించేస్తున్నారు. వీటి వలన అనేక రోగాలు వస్తాయి. సహజ సిద్ధంగా మాగబెట్టిన పండ్లు దొరకవు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణ పద్ధతిలో పండ్లను మాగబెట్టే వ్యాపారులు కరువైపోయారు. తొందరగా విక్రయించాలని లేదా డబ్బు సంపాదించాలనే ఆశతో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. 
 
ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటున్నా వారి పద్ధతి మార్చుకోవడం లేదు. హైదరాబాద్‌కే పరిమితం అనుకుంటే ఇతర జిల్లాలలో కూడా ఇదే తరహాలో విక్రయాలు జరుగుతున్నాయి. పండ్లు కావలసిన వారు వేరే విధిలేక వాటిని కొనుగోలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుండి కూడా ఇలాంటి పండ్లు దిగుమతి అవుతున్నాయి. అధికారులు వ్యాపారులపై నిఘాని పటిష్టం చేయాలని ఇలాంటి కల్తీ పండ్ల విక్రయాన్ని అడ్డుకోవాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.