సూపర్ ఫీచర్లతో విడుదలైన హువావే పీ30 ప్రొ స్మార్ట్‌ఫోన్‌

మోహన్| Last Updated: మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (16:35 IST)
మొబైల్స్‌ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్‌ పీ30 ప్రొను ఇవాళ భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. భారత్‌లో విడుదలైన హువావే లేటెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇదే కావడం విశేషం. కాగా ఇందులో 6.47 అంగుళాల భారీ డిస్‌ప్లేను అమర్చారు. ఆండ్రాయిడ్‌ 9.0 పై ఓఎస్‌ను ఇందులో అందిస్తున్నారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను ఇందులో పొందుపరిచారు. 
 
బ్యాక్ సైడ్‌లో 40, 20, 8 మెగాపిక్సెల్స్ కెపాసిటీ ఉన్న మూడు కెమెరాలను ఈ ఫోన్‌లో అమర్చారు. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్‌ కెమెరా ఉంది. ఐపీ 68 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌ను ఇందులో అందిస్తున్నారు. 4200 ఎంఏహెచ్‌ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. దీన్ని సున్నా నుంచి 70 శాతం ఛార్జింగ్‌ చేసేందుకు కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. అలాగే వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ను కూడా ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. 
 
హువావే పీ30 ప్రొ ఫీచర్లు...
6.47 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సెల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌, హువావే కైరిన్‌ 980 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, 40, 20, 8 మెగాపిక్సల్‌ ట్రిపుల్‌ బ్యాక్‌ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, హైబ్రిడ్‌ డ్యుయల్‌ సిమ్‌, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఐపీ 68 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌ సి, 4200 ఎంఏహెచ్‌ బ్యాటరీ, సూపర్‌ చార్జ్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌, వైర్‌లెస్‌ చార్జింగ్‌ సదుపాయం కూడా కలదు. 
 
హువావే పీ30 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ రూ.71,990 ధరకు అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యం కానుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ ఫోన్‌ వినియోగదారులకు లభిస్తుంది. కాగా లాంచింగ్‌ సందర్భంగా పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను కొన్నవారికి రూ.15,990 విలువైన హువావే వాచ్‌ జీటీని కేవలం రూ.2000కే అందివ్వనున్నారు. అలాగే 6 నెలల కాలవ్యవధి గల రూ.20వేల విలువైన ఉచిత స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్‌ను కూడా ఈ ఫోన్‌తో అందివ్వనున్నారు.దీనిపై మరింత చదవండి :