శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Modified: సోమవారం, 25 మార్చి 2019 (18:31 IST)

అహో 'ఓప్పో'... మొదటి 5జి స్మార్ట్‌ఫోన్ రిలీజ్... మార్కెట్లో కుమ్ముడే కుమ్ముడు

మొబైల్ తయారీ సంస్థ ఒప్పో తన మొదటి 5జి ఫోన్‌ను ప్రదర్శించింది. అయితే ఈ 5జి స్మార్ట్ ఫోన్‌ను ప్రస్తుతం యూరప్ మార్కెట్లో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒప్పో సంస్థ తమ మొట్టమొదటి 5జి స్మార్ట్ ఫోన్ ప్రపంచవ్యాప్త పరీక్ష సేవల సంస్థ అయిన స్పార్టాన్ ఇంటర్నేషనల్ ఇంక్ నిర్వహించిన 5జి సీఈ పరీక్షలో విజయవంతంగా నెగ్గినట్లు ఒప్పో సంస్థ సోమవారం ప్రకటించింది.
 
యూరోపియన్ మార్కెట్‌లలో ఆరోగ్యం, భద్రత, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ అనుకూలత, వైర్‌లెస్ వంటి రంగాల్లో ప్రవేశించాలంటే సీఈ ధృవీకరణ తప్పనిసరిగా ఉండాలి. తమ సరికొత్త 5జి పరికరం యూరప్ ప్రజల వినియోగ అవసరాలకు తగినట్లుగా ఉందని ఒప్పో సంస్థ ఈ సందర్భంగా తెలియజేసింది. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2019లో ఒప్పో తయారుచేసిన సరికొత్త 5జి ఫోన్‌ను ప్రదర్శించారు. అనేక దేశాలు, ప్రాంతాల్లో విస్తరించిన ఎక్కువ బ్యాండ్ కాంబినేషన్లు, విస్తృత బ్యాండ్‌విడ్త్‌లలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.