ఒప్పో నుంచి 'కె1' స్మార్ట్‌ఫోన్2.. ధర రూ.16,990

మోహన్ మొగరాల| Last Updated: గురువారం, 7 ఫిబ్రవరి 2019 (15:21 IST)
మొబైల్‌ల తయారీ రంగంలో చైనాకు చెందిన ఒప్పో సరికొత్త మోడల్‌లను మార్కెట్‌లోకి విడుదల చేస్తూ సాటి మొబైల్ కంపెనీలకు గట్టి పోటీని ఇస్తోంది. కాగా దేశీయంగా వివిధ కంపెనీల నుండి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి 'కె' సిరీస్‌లో కొత్త ఫోన్‌ని అందుబాటులోకి తెచ్చింది. కంపెనీ బుధవారం నాడు 'కె' సిరీస్‌లో భాగంగా ఒప్పో 'కె1' స్మార్ట్‌ఫోన్2ని ఆవిష్కరించింది.
 
ప్రపంచవ్యాప్తంగా 'కె' సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు లభిస్తున్న ఆదరణ కారణంగానే 'కే1'ను తీసుకువస్తున్నట్లు ఒప్పో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ విల్ యాంగ్ తెలిపారు. ఫిబ్రవరి 12వ తేదీ నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. అయితే భారత్‌లో 'కె1' స్మార్ట్‌ఫోన్ ధర రూ. 16,990గా నిర్ణయించబడింది.
 
ఫోన్‌ ప్రత్యేకతలు
డిస్‌ప్లే: 6.41 అంగుళాల డిప్లే, వాటర్‌డ్రాప్ నాచ్‌
మెమోరీ: 4జీబీ రామ్‌, 64జీబీ ఇంటర్నెల్ మెమోరీ, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమోరీ
కెమెరా: 25 మెగాపిక్సెల్‌ ఫ్రంట్ కెమెరా, (16 మెగాపిక్సెల్‌, 2 మెగాపిక్సెల్‌) కలిగిన రెండు బ్యాక్ కెమెరాలు
బ్యాటరీ: 3,600 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 
ఆపరేటింగ్‌ సిస్టమ్‌: ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో ఆధారిత  colorOS 5.2 ఒప్పో ఆపరేటింగ్‌ సిస్టమ్‌
ప్రాసెసర్‌: ఆక్టా కోర్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 660, 2.2 GHz ప్రాసెసర్.
ధర: రూ. 16,990గా ఉండవచ్చు.దీనిపై మరింత చదవండి :