శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 18 డిశెంబరు 2018 (16:19 IST)

''మైక్రోమాక్స్'' ఇన్ఫినిటీ ఎన్ సిరీస్‌ నుంచి స్మార్ట్‌ఫోన్లు.. జియో ఉచితంగా?

''మైక్రోమాక్స్'' 'ఇన్ఫినిటీ ఎన్' సిరీస్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి లాంఛ్ చేసింది. ఇన్ఫినిటీ ఎన్11, ఇన్ఫినిటి ఎన్ 12 పేరిట విడుదలైన ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో భారీ బ్యాటర్ (4వేల ఎంఏహెచ్), డుయెల్ కెమెరాలతో పాటు మీడియా టెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌ని అమర్చారు. మైక్రోమ్యాక్స్ ఇన్ఫినిటీ ఎన్11 ఫోన్ ధర రూ.8,999 ఉండగా, మైక్రోమ్యాక్స్ ఇన్ఫినిటీ ఎన్12 ఫోన్ ధర రూ.9,999గా నిర్ణయించారు. 
 
ఈ నెల 25 నుంచే విక్రయానికి అందుబాటులోకి రానున్న ఈ ఫోన్లపై పలు ఆఫర్లు కూడా ఉన్నాయి. రిలయన్స్ జియో వినియోగదారులు రూ.2200 క్యాష్ బ్యాక్‌‍తో పాటు రూ.198, రూ.299 రీఛార్జ్‌‍లపై 50 జీబీ డేటాని ఉచితంగా పొందనున్నారు.  
 
ఫీచర్స్ సంగతికి వస్తే.. 
మైక్రోమ్యాక్స్ ఇన్ఫినిటీ ఎన్ 11. 8 మెగాపిక్సల్, ఫ్రంట్ ఫేసింగ్ లెన్స్, 2జీబీ రామ్‌ను కలిగివుంటుంది. మైక్రోమ్యాక్స్ ఇన్ఫినిటీ ఎన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో అవుట్ ఆఫ్ ది బాక్స్‌ను కలిగివుంటుంది.