బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 23 ఫిబ్రవరి 2019 (17:52 IST)

త్వరలో కార్తీ సరసన నటించనున్న రష్మిక..

ఛలో, గీతా గోవిందం వంటి చిత్రాలతో టాలీవుడ్‌‌కు పరిచయమయ్యారు రష్మిక. ఆమె మొదటిసారిగా టాలీవుడ్‌లో నటించిన ఈ రెండు చిత్రాలతో సూపర్ హిట్ సాధించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక.. ఇప్పుడు ఇక్కడ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయారు. ఇక ఈ చిత్రాల విజయంతో రష్మిక ఫుల్‌స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్, నితిన్‌తో భీష్మ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
 
ఇప్పుడు ఈ భామ కోలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులు కూడా ఇదే విషయాన్ని ప్రశ్నలుగా అడిగారు. అప్పుడు రష్మిక.. నాకు కూడా కోలీవుడ్‌లో సినిమాలు చేయాలని ఉందనే కోరికను వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు పడుతున్నట్లు సమాచారం. త్వరలోనే యంగ్ హీరో కార్తీ సరసన రష్మిక జోడిగా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.