గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (15:49 IST)

గుత్తా జ్వాల ఇంట పెళ్లి సంద‌డి

pasupu snanayam
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, న‌టి అయిన గుత్తా జ్వాల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్ట‌బోతోంది. ఈరోజు గురువారం హైద‌రాబాద్‌లో ఆమె క‌రోనా నిబంధ‌న‌ల మేర‌కు పెండ్లి చేసుకోబోతోంది. తమిళ హీరో విశాల్ విష్ణును ఆమె వివాహం చేసుకోబోతోంది. క‌రోనా ఫ‌స్ట‌ఫేస్‌లోనే గతేడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం అతి కొద్ది మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో జ‌రుపుకున్నారు. ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్ అయిన‌ప్ప‌టికీ మితంగా బంధువుల స‌మ‌క్షంలో ఒక‌టి కానున్నారు.

ఈ సంద‌ర్భంగా ఈరోజు ఉద‌యం గుత్తా ఇంట ప‌సుపు నీళ్ళ స్నానం, మెహెందీ కార్య‌క్ర‌మాలు సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిగా జ‌రిగాయి. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఆమె ఫొటోగ్రాఫ్ పెట్టిన ఫొటోలు అభిమానుల‌ను అల‌రించాయి. పెళ్లి కూతురుగా ఆమె వ‌స్త్రధార‌ణ సంప్ర‌దాయంగా వుండాల‌నీ, ఎక్కువ ఆర్భాటాలు చేకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు కుటుంబ స‌బ్యులు తెలిపారు.