గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (15:16 IST)

`సంకీర్తన` నిర్మాత మృతి

Gangayya
నాగార్జున, రమ్యకృష్ణ జంటగా న‌టించిన‌ 'సంకీర్తన' చిత్ర నిర్మాత డాక్టర్ యం. గంగయ్య మృతి చెందారు. బుధవారం రాజమండ్రిలో మ‌ర‌ణించిన‌ట్లు నిర్మాత‌ల మండ‌లి ప్ర‌క‌టించింది. ఈ సినిమా ద్వారా గీతాకృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చిన ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. దర్శకుడిగా గీతాకృష్ణకు మంచి పేరు రావడంతో పాటు ఆ తర్వాత ఆయన పలు భిన్నమైన చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించింది. ని

ర్మాత గంగయ్య మృతి పట్ల పలువురు నిర్మాతలు సంతాపం తెలియచేశారు. తెలుగు చ‌ల‌న‌చిత్ర నిర్మాత‌ల‌మండ‌లి ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని శ్ర‌ధ్దాంజ‌లి ఘ‌టించింది. ఆయ‌న అనారోగ్య కార‌ణంగా కొద్దిరోజులుగా ఆసుప్ర‌తిలో వున్నార‌ని ఛాంబ‌ర్ సంతాప‌సందేశంలో పేర్కొంది.