శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 21 ఏప్రియల్ 2021 (18:16 IST)

సెక్సీ స‌న్నీ రాణిగా న‌టిస్తోంది, త‌మిళం నేర్చుకుంటోంది

Sunny leoen
సన్నీ లియోన్ సెక్సీ న‌టిగా పేరు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో క‌రెంట్ సినిమాలో టీచ‌ర్‌గానూ న‌టించింది. త‌ను ఇప్పుడిప్పుడే మంచి పాత్ర‌లు చేయాల‌ని అనుకుంటోంది. దాని కోసం సీరియస్‌గా త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే పాత్ర‌ల‌పై దృష్టి పెడుతుందోన‌ని తెలుస్తోంది. ఏవో సినిమాలు చేశాం. అనేకంటే స‌రైన పాత్ర‌లు చేస్తేనే జ‌నాల్లో గుర్తిండిపోతామ‌ని ఓ నిర్ణ‌యానికి తీసుకుంద‌ట‌.

అందుకే త‌మిళ సినిమాలో న‌టించ‌డంతోపాటు క‌ష్టపడి మరి తమిళం నేర్చుకునే పనిలో ఉంది‌. తమిళంలో ‘వీరమాదేవి’ అనే సినిమాలో నటిస్తోన్న సన్నీ తాజాగా మరో తమిళ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పిందట. యువన్‌ అనే దర్శకుడు తెరకెక్కించే ఈ సినిమా హిస్టారికల్‌ హారర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వుంటుందని తెలుస్తోంది. అది కూడా ప్రస్తుతం కాలానికి, వెయ్యేళ్ల క్రితం క్లియో పాత్ర జీవించిన కాలానికి మధ్య సినిమా నడుస్తుందట. ఇందులో సన్నీలియోన్‌ రాణి పాత్రలో కనిపిస్తుందని, అందుకే ఆ పాత్రకోసం తమిళం నేర్చుకుంటుందని తెలిసింది.