రేణుదేశాయ్‌కు మెమోరీస్ ఫర్ లైఫ్ `బద్రి`
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన `బద్రి` సినిమా మెమోరీస్ ఫర్ లైఫ్ అంటూ రేణుదేశాయ్ పేర్కొంది. ఇలా అనడానికి కారణం బ్రది సినిమా వచ్చి 21 ఏళ్ళ పూర్తయ్యాయి. మంగళవారంనాటికి పూర్తయిన ఈ సినిమా గురించి అప్పటి స్టిల్ గురించి ఆమె తన సోషల్ మీడియాలో పెట్టి ఆనందాన్ని పంచుకుంది. ఈ మూవీ ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది రేణు దేశాయ్. బద్రి 21 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ప్రత్యేకమైన ఫొటోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. `హే చికిత్తా.. పాటలో గన్ పట్టుకుని కౌబాయ్ గెటప్‌లో పవన్‌కల్యాణ్ ఉండగా ఆయన ముందు దుప్పట్టా కప్పుకుని తను ఉన్న ఫొటోని రేణు దేశాయ్ అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోకి మెమోరీస్ ఫర్ లైఫ్ అని హ్యాష్ ట్యాగ్ జోడించారు.
పూరీకి ప్రత్యేకం
ఈ సినిమా రిలీజ్ డేట్‌కు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూ ప్రత్యేకం కావడం మరో విశేషం. ఆయన నేటికి సినిమా రంగానికి వచ్చి 21 ఏళ్ళ పూర్తవడం మరో ప్రత్యేకత. ఈ సందర్భంగా ఆయన తన చేసిన హీరోలతో కూడిన పోస్టర్ ను కూడా డిజైన్ చేసుకున్నారు.
- బద్రి సినిమాలో చాలా ఫేమస్ డైలాగ్‌లు ఉంటాయి. ఆ డైలాగులను గుర్తు తెచ్చుకుని మరి పవన్ అభిమానులు #21yearsforbadri అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఇక బద్రి సినిమా విషయానికి వస్తే.. అప్పటికే సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు అంటూ మూడు హ్యాట్రిక్ హిట్స్ కొట్టి మంచి దూకుడు మీద ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ఆ మూడు సినిమాల కంటే డిఫరెంట్‌గా, చాలా పవర్ఫుల్‌గా బద్రిలో ప్రజెంట్ చేశారు పూరి జగన్నాథ్. ఈ సినిమాలో నువ్వు నందా అయితే ఏంటి?.. నేను బద్రి.. బద్రీనాథ్ అంటూ పవన్ కల్యాణ్ చెప్పే ఈ డైలాగ్ ఇప్పటికీ చాలామంది నోళ్లలో నానుతూనే ఉంటుంది. ఇది నచ్చే పవన్ అభిమాని వేణు శ్రీరామ్ తను చేసిన వకీల్ సాబ్ సినిమాలోనూ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్‌కు నందా అనే పేరు పెట్టడం విశేషం.
విజయ లక్ష్మీ మూవీస్ పతాకంపై టి. త్రివిక్రమ రావు నిర్మించిన బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక యాడ్ ఏజెన్సీ నడిపే వ్యక్తి గా కనిపిస్తారు. రేణు దేశాయ్, అమీషా పటేల్ ఇద్దరూ పవన్ సరసన హీరోయిన్స్‌గా నటించారు. ఇద్దరికీ ఇది మొదటి సినిమా కావడం గమనార్హం. ఈ సినిమా మ్యూజిక్ కూడా అప్పట్లో మంచి హిట్ అయింది. తమ్ముడు సినిమాకు పనిచేసిన రమణ గోగుల పవన్ కళ్యాణ్ కాంబినేషన్ బాగా కుదరడంతో ఈ సినిమాకి కూడా వీరి కాంబినేషన్‌ను రిపీట్ చేశారు. ఈ దెబ్బకు ఈ సినిమా పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి. అయాం యాన్ ఇండియన్ అనే ఇన్స్పిరేషనల్ సాంగ్ అయితే ఇప్పటికీ యూత్ నోళ్లలో నానుతూనే ఉంటుంది.. ఇక బంగాళాఖాతంలో, హే చికితా లాంటి పాటలు చాలామంది ఇప్పటికీ హమ్ చేస్తూ ఉంటారు. ఇక వేవేల వర్ణాల తార అనే పాట మాత్రం రొమాంటిక్ టచ్‌తో చాలా ఆల్బమ్స్ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. అలా మొత్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను అమాంతం పెంచేసిన ఈ సినిమా 2000 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన విడుదలై మంగళవారానికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఇక బద్రి సినిమా గురించి చెప్పాలంటే, మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా ప్రారంభోత్సవానికి క్లాప్ కొట్టడం విశేషం.
85 థియేటర్లలో 50 డేస్, 47 థియేటర్లలో హండ్రెడ్ డేస్ జరుపుకున్న ఈ సినిమా అమెరికాలో విడుదలైన తొలి తెలుగు సినిమాగా కూడా చరిత్ర సృష్టించింది. అప్పటిదాకా అమెరికాలో తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యేవి కావు. కానీ పవన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అప్పట్లో మొట్టమొదటిసారిగా ఈ సినిమాను అమెరికాలో కూడా రిలీజ్ చేశారు. ఇక ఆ తర్వాత వరుసగా అమెరికాలో కూడా తెలుగు సినిమాలు రిలీజ్ అవ్వడం మొదలయ్యాయి. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే పూరి జగన్నాథ్‌కు బద్రి మొదటి సినిమా కాదు. ఈ సినిమా కంటే ముందే ఆయన సూపర్ స్టార్ కృష్ణతో 96లో ఒక సినిమా చేయడం మొదలు పెట్టారు. అయితే సినిమా షూటింగ్ అంతా పూర్తి అయినా సరే అనుకోని కారణాల వల్ల సినిమా విడుదల కాలేదు. దీంతో పవన్ కళ్యాణ్‌తో పూరి జగన్నాథ్ సినిమా చేసి రిలీజ్ చేయగా అదే ఆయన మొట్టమొదటి సినిమా అయి ఘన విజయం సాధించి మంచి పేరు తెచ్చిపెట్టింది. సో.. పవన్‌కూ, పూరీకి ఈ సినిమా 21 ఏళ్ళ జర్నీని గుర్తు చేస్తుంది.