కరోనా విజృంభణ: వకీల్ సాబ్ చూసేందుకు హైదరాబాద్ థియేటర్లో 20 మంది
కరోనా వల్ల నిన్న తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు పవన్ కళ్యాణ్ `వకీల్ సాబ్`ను ప్రదర్శించాలని, మిగిలిన థియేటర్లను మూసివేయాలని తీసుకున్న నిర్ణయం వారికే బెడిసికొట్టేట్లు కనిపిస్తుంది. రెండోవారంలోకి ప్రవేశించి ఈ సినిమా కలెక్షన్లు అప్పడే పలచగా వున్నాయి. అయినా సినిమాను ప్రదర్శిస్తూనే వున్నారు. నిన్న తీసుకున్న నిర్ణయం ప్రకారం మల్టీ ప్లెక్స్‌లు మాత్రమే మూసివేయాలనీ, మామూలు థియేటర్లు తెరిచివుంచుకోవచ్చని నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పుడు మామూలు థియేటర్లలో రేపు శుక్రవారం అనగా 23వ తేదీన శుక్ర సినిమా, ఇప్పటికే వర్మ దెయ్యం సినిమాలతోపాటు ఒకటి రెండు డబ్బింగ్ సినిమాలు ప్రదర్శన జరుగుతున్నాయి. అయినా వర్మ దెయ్యం సినిమాకు మొదటి నుంచి పెద్దగా కలెక్షన్లు లేవు. కనుక కొన్ని ప్రాంతాల్లో శుక్ర సినిమాను ఆడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నిన్న జరిగిన ఎగ్జబిటర్ల సమావేశంలో కేవలం వకీల్‌సాబ్‌ను ప్రదర్శిస్తే ముందుముందు కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని కొందరు ప్రశ్నిస్తే అందుకు సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ముఖ్యంగా నైజాంలో పెద్ద పెద్ద పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు ఆ సినిమాకు సంబంధించినవారే. అయితే గత రెండు రోజులుగా వకీల్‌సాబ్‌కు కలెక్షన్లు భారీగా పడిపోయాయి.
నిన్న హైదరాబాద్‌లోని చాలా చోట్ల అస్సలు జనాలే లేరు. ఓ థియేటర్లో 10 మంది కూర్చుని సినిమా చూసారు. క్రాస్‌రోడ్‌లో పట్టుపని పదిమంది కూడా లేకుండా థియేటర్లో ప్రదర్శించినట్లు తెలిసింది. అదేవిధంగా బోడుప్పల్, మారేడ్‌పల్లి, అత్తాపూర్ వంటి చోట్ల అస్సలు ప్రేక్షకులు థియేటర్లకు రావడంలేదు. ఇక ఈ విషయంలో ప్రధాన పంపిణీదారుడు, ఎగ్జిబిటర్ దిల్‌రాజు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.