శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: బుధవారం, 14 ఏప్రియల్ 2021 (21:59 IST)

గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్న నివేద థామస్, ఏమైంది?

వకీల్ సాబ్‌తో కలిసి నటించి ఒక రొమాంటింగ్ సాంగ్ చేశారు శృతి హాసన్. పవన్ కళ్యాణ్‌తో శృతికి మూడవ సినిమా అన్నది సినిమా ప్రమోషన్స్‌కు బాగానే ఉపయోగపడిందట. కానీ సినిమా విడుదల అయిన తరువాత మాత్రం శృతి మార్క్ మాత్రం ఎక్కడా కనబడలేదట. ఆమె ప్లేస్‌లో నిలబడ్డారట నివేదా థామస్.
 
నాలుగేళ్ళపాటు తెలుగు ఆడియెన్స్‌తో అటామెంచ్ ఉన్నా ఇంకా ఏదో వెలితి ఫీలవుతున్న నివేదా థామస్ ఇప్పుడు గట్టిగా ఊపిరిపీల్చుకుంటున్నారట. వకీల్ సాబ్ సినిమాలో నటించి ది బెస్ట్ అనిపించుకున్నాంటున్నారు నివేద.
 
గతంలో తెలుగులో అరడజను సినిమాలు చేసినా రానంత క్రేజ్ ఒక్క వకీల్ సాబ్ తోనే సొంతం చేసుకున్నారు. మొత్తమ్మీద వకీల్ సాబ్ హిట్ ఆమెకి మరిన్ని ఆఫర్లు తెస్తుందని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.