శనివారం, 8 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : శనివారం, 8 ఫిబ్రవరి 2025 (16:32 IST)

తెలుగులో హారిసన్ ఫోర్డ్ క్లాసిక్ మార్వెల్ - కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్

Anthony Mackie, Harrison Ford
Anthony Mackie, Harrison Ford
థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, పవర్ ఫుల్ ఫైట్‌లతో  కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ చిత్రం  ఫిబ్రవరి 14న విడుదల కానుంది, ఇది MCU యొక్క ఆరవ భాగం. లెజెండరీ నటుడు హారిసన్ ఫోర్డ్ పోషించిన రెడ్ హల్క్ పాత్రను పరిచయం చేయడంతో ఈ చిత్రం ఏమి ఈసారి ఏమి చెప్చూపబోతుందో చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల అవుతుంది.
 
కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ చిత్రీకరణ సమయంలో  MCUలోకి (మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్) అడుగుపెడుతున్నప్పుడు తన అనుభవాన్ని పంచుకుంటూ, ఫోర్డ్ తన పాత్ర యొక్క పవర్ ఫుల్ డైనమిక్స్‌తో పాటు రాజకీయ కుట్రలో మునిగిపోవడం గురించి చెప్పాడు. కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ హై స్టేక్స్ యాక్షన్‌ను ఆకర్షణీయమైన కథనంతో ఎలా మిళితం చేస్తుందో ఆయన హైలైట్ చేస్తూ, “అవును, దీనికి చాలా పొలిటికల్ థ్రిల్లర్ అంశం ఉంది   కొన్ని అద్భుతమైన విషయాలు లు ఉన్నాయి,  బలమైన భావోద్వేగ పాత్ర కథ కూడా ఉంది.” మార్వెల్ పాత్రలు ఖచ్చితంగా వారి వ్యక్తిత్వాలకు చెందిన ఆసక్తికరమైన అంశాలను కలిగి ఉంటాయి, అధ్యక్షుడి పాత్రలో నేను వెతుకుతున్నది భావోద్వేగ వాస్తవికత, చుట్టూ జరుగుతున్న అన్ని అద్భుతమైన విషయాలకు కొంత మానవ ప్రవర్తన మరియు సందర్భాన్ని అందిస్తుంది.” అన్నారు. 
 
జూలియస్ ఓనా దర్శకత్వం వహించిన కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్, ఆంథోనీ మాకీ, హారిసన్ ఫోర్డ్, డానీ రామిరేజ్, షిరా హాస్, జోషా రోక్మోర్, కార్ల్ లంబ్లీ, లివ్ టైలర్,  టిమ్ బ్లేక్ నెల్సన్ నటించారు.