Vyjayanthireddy, Sadanand
తాను చాలా మంచివాడినని, తనను కొందరు మోసం చేసారని అందుకే 14 దూరంగా సినిమాలకు ఉన్నానని శింగనమల రమేష్ బాబు చెప్పినవన్నీ అబద్దాలు, అవాస్తవాలు అని అసలు మోసగాడు అతనేనని మా పెట్టుబడితో "కొమరంపులి, ఖలేజా" సినిమాలను తీసి. మా డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడు , మాతో పాటు ఇంకెందరో బాధితులు ఉన్నారు. ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు శింగనమల రమేష్ బాబును చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలి అని ఫైనాన్సియర్స్ వైజయంతిరెడ్డి, ఆమె తరపున భర్త సదానంద్ చెప్పారు.
"కొమరంపులి, ఖలేజా" చిత్రాల నిర్మాత శింగనమల రమేష్ బాబు మోసాలు, బెదిరింపులు, అక్రమాస్తుల నిగ్గు తేల్చేందుకు మేము ఎంతదూరమైనా పోరాటం చేస్తామని ఆ చిత్రాలకు పెట్టుబడి పెట్టిన ఫైనాన్షియర్ వైజయంతి రెడ్డి తరపున ఆమె భర్త సదానంద్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సదానంద్ మాట్లాడుతూ, శింగనమల రమేష్ బాబు పచ్చి మోసగాడు అని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్ లో శింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకుని మరీ అన్నీ అబద్దాలు చెప్పారు. మా దగ్గర ఫైనాన్స్ తీసుకుని, ఆ పెట్టుబడితో "కొమరంపులి, ఖలేజా" సినిమాలను తీసి, తాను నష్టపోయాను అని అతను అవాస్తవాలు చెప్పారు. అంతేకాదు ఆ రెండు సినిమాల షూటింగులు జరిగేటప్పడు, సూరి, భానుకిరణ్ వంటి ఫ్యాక్షనిస్టులతో పాటు ఎందరో రౌడీలు వచ్చి, లొకేషన్స్ లో కూర్చునేవారు. దాంతో షూటింగులు చేసేందుకు హీరోలు, ఆరిస్టులు ఎలా వస్తారు. శింగనమల రమేష్ బాబు తప్పుడు విధానాలు, అలవాట్ల వల్లనే ఆ రెండు సినిమాల షూటింగులు ఆలస్యం అయ్యాయి తప్ప హీరోలు, డైరెక్టర్స్ వల్ల కానేకాదు. వారివల్ల నష్టపోయినట్లు అతను ఆరోపించడంతో ఎంతమాత్రం వాస్తవం లేదు. అతను స్వయంకృతాపరాధంతో సినిమాలను రిలీజ్ చేయలేకపోతే సి.కళ్యాణ్ గారు సినిమాలను రిలీజ్ చేశారు.
సినిమాల రిలీజ్ తర్వాత మేము పెట్టిన పెట్టుబడిని తిరిగి ఇవ్వమని శింగనమల రమేష్ బాబును అడిగితే,... అతని రౌడీ గ్యాంగ్ తో పాటు భానుకిరణ్,, అతనికి చెందిన గ్యాంగ్ నా తలపై తుపాకి గురిపెట్టి చంపివేస్తాం అంటూ బెదిరించారు. దాంతో అప్పట్లో మేము హైదరాబాద్ సీసీఎస్ లో కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత సూరి చనిపోయిన తర్వాత సీసీఎస్ లో మేము పెట్టిన కేసును సీఐడీకి బదిలీ చేయడం జరిగింది.
శింగనమల రమేష్ బాబు తదితరులపై మేము పెట్టిన కేసును నాంపల్లి క్రిమినల్ కోర్టు ఇటీవల జనవరి 31వ తేదీన కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు దానిపై సీఐడీ వారితోపాటు మేము కూడా తెలంగాణ హైకోర్టులో అప్పీల్ కు వెళ్ళబోతున్నాం. అయితే దీనిపై శింగనమల రమేష్ బాబు ఇటీవల ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడిన అంశాలలో మా కేసులోనే స్థలాలను ముగ్గురికి అమ్మినాను అని చెప్పి, ఫలానా వ్యక్తి తనపై కేసు పెట్టినట్లుగా ఆయన చెప్పడంతో పాటు ఆ కేసులో నేను గెలిచాను అని అతను చెప్పినారు.
వాస్తవానికి మాకే కాదు ప్రొద్దుటూరుకు చెందిన ఇంకెందరో ఫైనాన్సియర్స్ దగ్గర సినిమాల కోసం శింగనమల రమేష్ బాబు ఫైనాన్స్ తీసుకుని వారందరికీ జవాబు చెప్పకుండా ఎగ్గొట్టి, తిరుగుతున్నాడు. దాదాపు 300 కోట్ల రూపాయల మేర డబ్బులు అతను ఇవ్వాల్సిన బాధితులు ఉన్నారు. ఫైనాన్సియర్స్ డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై లలో అతను కుటుంబ సభ్యులు, ఇతర బినామీల మీద ఆస్తులు పెంచుకుని, ఫైనాన్సియర్స్ ను మోసం చేసి, అడిగినవారిని చంపేస్తామంటూ బెదిరించారు. ఐ
ఇతని అరాచకాలపై క్రిమినల్ కేసుపై సీఐడీ తో పాటు మేము కూడా హైకోర్టులో అప్పీల్ కు వెళ్ళబోతున్నాం.. అలాగే హైదరాబాద్, సిటీ సివిల్ కోర్టులో కేసు వేశాం. అలాగే మాకు న్యాయం జరిగేంతవరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం. మిగతా బాదితులందరినీ కలుపుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని, తమిళనాడు సీఎంను కలిసి అన్ని విషయాలను వివరిస్తాం అన్నారు.