ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2016 (17:51 IST)

సీనియర్ ఎన్‌టిఆర్‌తో చిన్నవేషం వేశాను.. అది సూపర్ హిట్ : హేమమాలిని

చాలా ఏళ్ల క్రితం ఎన్టీఆర్‌గారు నటించిన 'పాండవ వనవాసం' చిత్రంలో చిన్న వేషం చేశాను. ఇప్పుడు ఆయన తనయుడైన బాలకష్ణగారి 100వ చిత్రంలో తల్లి పాత్రలో నటించాను. ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నా.. మంచి జర్నీగా ఫ

చాలా ఏళ్ల క్రితం ఎన్టీఆర్‌గారు నటించిన 'పాండవ వనవాసం' చిత్రంలో చిన్న వేషం చేశాను. ఇప్పుడు ఆయన తనయుడైన బాలకష్ణగారి 100వ చిత్రంలో తల్లి పాత్రలో నటించాను. ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నా.. మంచి జర్నీగా ఫీలవుతున్నానని.. బాలీవుడ్ అగ్రనటి హేమామాలిని అన్నారు. షూటింగ్‌లోనే అందరూ చాలా కష్టపడ్డారు. ఇది సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రంగా సక్సెస్‌ సాధిస్తుందని అన్నారు. 
 
ఆ తర్వాత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ... కల్పితమైన 'బాహుబలి' సినిమాను ఏళ్ళతరబడి తీస్తున్నారు. అలాంటిది. చారిత్రాత్మక రాజు చరిత్రను తెలపాలంటే ఎన్నాళ్ళు తీయాలి... కనీసం రెండేళ్ళు పట్టిది. కానీ 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని కొన్ని నెలల్లోనే చకచకా తీసేసి చూపించిన ఘనత దర్శకుడు క్రిష్‌కు, బాలకృష్ణకు దక్కుతుందన్నారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ.. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశాన్ని హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు పాలించిన ఐదు రాజ వంశాలు తెలుగుజాతివే. అందులో ఐదు వంశం శాతావాహనులు. ప్రపంచాన్ని మన తెలుగు జాతివైపు తిప్పేంత గొప్పగా నాలుగు వందల సంత్సరాలు పరిపాలన చేశారు. అందులో గొప్ప చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి. తల్లి గొప్పతనం తెలిసిన వ్యక్తిగా తన తల్లిపేరునే తన పేరుగా మార్చుకున్న వ్యక్తి. ఎంతో కష్టపడి సినిమాను తీసిన నిర్మాతలు రాజీవ్‌రెడ్డి, సాయిబాబు, బిబో శ్రీనివాస్‌లకు అభినందనలే కాదు, తెలుగు జాతి కృతజ్ఞతలు కూడా చెప్పాలని అన్నారు.