శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 8 మార్చి 2017 (15:06 IST)

ఉమెన్స్ డే.. మెగా మహిళల గ్రూప్ ఫోటో పోస్ట్ చేసిన చెర్రీ.. ఉపాసన-సురేఖ ఫోటో మెర్జ్ చేసి?

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. తమకు మద్దతుగా నిలిచిన శక్తికి పోస్టులు, ట్వీట్ల ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. తమకు మద్దతుగా నిలిచిన శక్తికి పోస్టులు, ట్వీట్ల ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు తన తల్లి ఇందిర, కుమార్తె సితార ఫోటోను పెట్టారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో, మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్ చేశారు. 
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తన కుటుంబంలో ఉన్న మహిళలందరి గ్రూప్ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. తన జీవితానికి అనుకూలంగా ఈ మహిళా శక్తి పనిచేసిందని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. గ్రూప్ ఫొటోతో పాటు తన తల్లి సురేఖ, భార్య ఉపాసన ఫొటోలను మెర్జ్ చేసి పోస్ట్ చేశాడు.
 
గ్రూప్ ఫొటోలో చిరంజీవి ఇద్దరు కూతుళ్లతో పాటు నాగబాబు తనయ నిహారిక, బన్నీ సతీమణి స్నేహారెడ్డిలతో సహా మెగా ఫ్యామిలీలోని ఇతర మహిళలందరూ ఉన్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి.