శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2017 (12:38 IST)

సుచిత్ర లీక్ చేసే ఫొటోలు, వీడియోలు అన్నీ ఫేక్ : హీరో ఆర్య

తమిళ గాయని సుచిత్ర కార్తీక్ ప్రైవేట్ ఫోటోలు, వీడియోల లీకేజీపై హీరో ఆర్య స్పందించారు. పలువురు హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోలను సామాజిక మాధ్య‌మాల్లో పోస్టు చేసి క‌ల‌క‌లం రేపుతున్న విషయం త

తమిళ గాయని సుచిత్ర కార్తీక్ ప్రైవేట్ ఫోటోలు, వీడియోల లీకేజీపై హీరో ఆర్య స్పందించారు. పలువురు హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోలను సామాజిక మాధ్య‌మాల్లో పోస్టు చేసి క‌ల‌క‌లం రేపుతున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై ఆర్య స్పందిసతూ... గాయని సుచిత్ర లీక్ చేసే ఫొటోలు, వీడియోలు అన్నీ ఫేక్ అని ఆరోపించాడు. వాటిని ప్రజలు నమ్మకూడ‌ద‌ని ప్రాధేయపడ్డాడు. ఆమె ఇలాంటి చవకబారు ప్రచారం చేసి బెదిరిస్తోంద‌ని, ఇది ప్రారంభం మాత్రమేన‌ని, ఇక‌పై ఆమె మరిన్ని ఫేక్ వీడియోల‌ను కూడా విడుద‌ల చేయొచ్చ‌న్నారు. 
 
ఇంటర్నెట్, యూట్యూబ్‌లో ఇలాంటి నకిలీ వీడియోలు రావ‌డం ఎంతో సాధార‌ణ‌మేన‌ని చెప్పాడు. వాటికి సినీన‌టుల పేర్లు జోడిస్తే  వైరల్‌గా మారుతాయన్నారు. ప్ర‌జ‌లు వాటిని చూస్తూ ప్రోత్స‌హించ‌కూడ‌ద‌న్నారు. సుచిత్ర సోష‌ల్ మీడియాలో పెడుతున్న‌వ‌న్నీ నకిలీవని తాను ఖచ్చితంగా చెప్ప‌గ‌ల‌న‌ని అన్నాడు.