గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 16 మార్చి 2017 (16:56 IST)

'బౌండరీ లైన్‌కొచ్చిన బంతిని పక్కకు నెట్టేయడం రాజమౌళి చేసే పని' : బాహుబలి ట్రైలర్‌పై హీరో రామ్ ట్వీట్

ప్రభాస్ - రానాలు నటించిన 'బాహుబలి 2' సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది. ట్రైలర్‌కు ముందు నుంచి ఊహించినట్లుగానే విపరీతమైన స్పందన వచ్చింది. గంటలోనే ఒక మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట

ప్రభాస్ - రానాలు నటించిన 'బాహుబలి 2' సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది. ట్రైలర్‌కు ముందు నుంచి ఊహించినట్లుగానే విపరీతమైన స్పందన వచ్చింది. గంటలోనే ఒక మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ సినీ ప్రముఖుల నుంచి చిత్ర బృందానికి అభినందిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలోనే హీరో రామ్ కూడా ట్రైలర్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బాహుబలి - 2ను 'ది ప్రైడ్ ఆఫ్' తెలుగు సినిమాగా అభివర్ణించాడు. సారీ 'ప్రైడ్ ఆఫ్ సౌత్ సినిమా'.. మళ్లీ సారీ.. 'ది ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా' అంటూ రామ్ ట్వీట్ చేశాడు. ఎస్‌ఎస్ రాజమౌళి ఈజ్ బ్యాక్. వాట్ ఏ ట్రైలర్ అంటూ ట్రైలర్‌ను ఆకాశానికెత్తేశాడు. 
 
అంతేకాదు, రాజమౌళికి సంబంధించి ఓ ఆసక్తికర ట్వీట్ కూడా చేశాడు. ప్రతీసారీ బంతిని బౌండరీకి మళ్లించడం కొందరి వంతైతే, ప్రతీసారీ బౌండరీ లైన్‌కొచ్చిన బంతిని పక్కకు నెట్టేయడం రాజమౌళి చేసే పనని ట్వీట్ చేశాడు. అంచనాలను అలా అమాంతం పెంచేస్తాడనేది రామ్ ట్వీట్ వెనకున్న పరమార్థం.