మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 4 జనవరి 2021 (20:29 IST)

30 రోజుల్లో బరువు తగ్గేది ఎలా? హీరో విజయ్ దేవరకొండ చెప్తున్న టిప్స్ ఏంటి?

హైదరాబాద్‌కు చెందిన కులదీప్ సేతి, సునీతా రెడ్డిల ఆధ్వర్యంలో 30 రోజుల్లో బరువు తగ్గే ఛాలెంజ్‌ని సినీ హీరో విజయ్ దేవరకొండ జూబ్లీహిల్స్‌లోని 360 డిగ్రీ ఫిట్నెస్ కార్యక్రమంలో ప్రారంభించారు. ఫిట్నెస్ గురు, సెలబ్రిటీ ట్రైనర్ కులదీప్ సేతి, 360 డిగ్రీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సునీతా రెడ్డిలతో కలిసి విజయ్ దేవరకొండ ఈ ఛాలెంజ్‌కి సంబంధించిన kuladepsethi.com వెబ్‌సైట్‌తో పాటు ఛాలెంజ్‌ను ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, కులదీప్‌సేతి.డాట్ కామ్ అనే వెబ్ సైట్ లాంచ్ చేయడం హ్యాపీగా ఉంది. నేను గత మూడు సంవత్సరాలుగా ఈ జిమ్‌కు వస్తున్నాను. కరోనా ముందు ఇక్కడ ఎంతో మంది వచ్చి జిమ్ చేయడం చూశాను. లాక్డౌన్‌లో నేను చేసిన ఒకే ఒక మంచి పని ప్రతి రోజూ వర్కౌట్ చేయడమే.
 
అలా చేయడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. అందరికీ చెప్తున్నా.. ఎక్సర్ సైజ్ చేయమని. ఇంట్లో వుండే వాళ్లకు ఈ 30 డేస్ అల్టీమేట్ చాలెంజ్ బాగా ఉపయెగపడుతుంది. నేను ఫైటర్ సినిమా కోసం బెస్ట్ బాడీ షేప్ తీసుకొచ్చాము. ఆ విషయంలో కుల్దీప్ ట్రైనింగ్ చాలా ఉపయోగపడింది. సినిమా అయ్యేలోపు నా బాడీని కొత్తగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం.
 
360 డిగ్రీస్ ఫిట్ నెస్ ఓనర్ సునీతా రెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రోగ్రాంకు స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గారికి స్పెషల్ థాంక్స్. ఆయన బాడీ చూస్తే అర్థమవుతుంది జిమ్‌లో అతనెంత కష్టపడతాడో. డిఫెరెంట్ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటాడు. కుల్ దీప్ సేతి వెబ్ సైట్ ద్వారా ఇంట్లో ఉండే అందరూ వర్కవుట్స్ చేసుకోవచ్చు.
 
ట్రైనర్ కులదీప్ సేతి మాట్లాడుతూ, విజయ్ ఓ సూపర్ స్టార్ అయినా కానీ నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు. చాలా మంచి మనిషి ఆయనను ట్రైన్ చేయడం ఒక చాలెంజ్. రోజు ట్రైన్ చేసినా కానీ మళ్లీ తరువాతి రోజు ఎనర్జీ తో వస్తాడు.ఫైటర్ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇండియాలొనే నెంబర్ వన్ గా విజయ్ దేవరకొండ బాడీ కాబోతుంది. నేను ప్రామిస్ చేస్తున్నాను. ఈ 30 డేస్ చాలెంజ్ ప్రోగ్రాం అందరికీ ఉపయెగపడుతుంది. ఈ ప్రోగ్రాంకు సపోర్ట్ చేసిన మా ఓనర్ సునీతా రెడ్డికి స్పెషల్ థాంక్స్.
 
కుల్దేప్ సేథి 15+ సంవత్సరాల అనుభవంతో నగరంలో ప్రసిద్ధి చెందిన ప్రముకులైన విజయ్ దేవరకొండ, అనుష్క శెట్టి, చిరంజీవి, రామ్ చరణ్, కార్టేకియన్, రాశి ఖన్నా, సందీప్ కిషన్, వరుణ్ తేజ్, కల్యాణ్ రామ్, రామ్ ఫోతినేని, రాజ్ తారున్, లావణ్య త్రిపాఠి వంటి ప్రముఖులకు ఆయన ఫిట్నెస్ ట్రైనర్ గా వ్యవహరిస్తున్నారు.  నగరంలోని అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు,  సామాజికవేత్తలు కూడా అతని వద్ద శిక్షణ తీసుకుంటున్నారు.  అతని నైపుణ్యం మరియు అనుభవం ఈ కార్యక్రమానికి పునాది.
 
సునీతా రెడ్డి 14 సంవత్సరాలుగా ఫిట్‌నెస్ పరిశ్రమలో ఉన్నారు మరియు రాష్ట్రంలో 360 డిగ్రీల ఫిట్‌నెస్ జిమ్‌లను ప్రారంభించడంలో ముందున్నారు. ఆరోగ్యం మరియు ఫిట్నెస్ పట్ల ఆమెకున్న అభిరుచి ఈ కార్యక్రమాన్ని రూపొందించడానికి కారణమైంది. 
 
30 days ultimate weight loss challenge ప్రతి రోజు 30 నిమిషాల పాటు బరువు తగ్గేందుకు చేసే కార్యక్రమం. ఇంట్లోనే ఉండి సూచించిన వర్కౌట్స్, ఆన్లైన్ శిక్షణ ద్వారా బరువు తగ్గించుకోవడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా ఆహార నియమాలు, వర్కౌట్స్ కు సంబంధించి వీడియోలను, డైట్ ప్లాన్స్ కు సంబంధించిన వీడియోలను అందిస్తున్నాం అని చెప్పుకొచ్చారు.