గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (18:52 IST)

త్రిష న‌టించిన `హే జూడ్` ఓటీటీలో రాబోతుంది

Trisha, Hey Jude, OTT movie
ఇప్పుడు అన్ని భాష‌ల్లో ఓటీటీ ఫ్లాట్ ఫార‌మ్‌లో ప‌లు సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. అందులో త్రిష న‌టించిన సినిమా రాబోతుంది. మన తెలుగులో కూడా చాలానే సరికొత్త స్ట్రీమింగ్ యాప్స్ వచ్చాయి. మరి అలా పలు ఇండిపెండెంట్ మూవీస్, వెబ్ సిరీస్ లు, కొత్త సినిమాల ప్రీమియర్, వివిధ భాషల్లోని డబ్బింగ్ చిత్రాలతో ‘ఫిలిం ఓటీటీ’ ఎగ్జైటింగ్, ఎంటర్ టైనింగ్ కంటెంట్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
 
”పిజ్జా 2” వంటి థ్రిల్లర్ సినిమాను తన తొలి ప్రీమియర్ గా ప్రదర్శించిన ఫిలిం ఓటీటీ ఇప్పుడు స్టార్ హీరోయిన్ త్రిష నటించిన తొలి మలయాళ చిత్రం ”హే జూడ్” ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రంలో నివిన్ పాలీ హీరోగా నటించారు. తెలుగు డబ్బింగ్ ”హే జూడ్” సినిమా ‘ఫిలిం ఓటీటీ’లో ఈ నెల 5న ప్రీమియర్ కానుంది.2018 లో మాలీవుడ్ లో రిలీజైన ”హే జూడ్” సినిమా మంచి రొమాంటిక్ కామెడీ చిత్రంగా ఆకట్టుకుంది.
 
అక్కడ ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం దర్శకుడు శ్యామ్ ప్రసాద్ ”హే జూడ్” చిత్రాన్ని రూపొందించారు. ఇదే కాకుండా త్వరలో మరిన్ని సూపర్ హిట్ చిత్రాలు ‘ఫిలిం ఓటీటీ’లో ప్రీమియర్ కు వస్తున్నాయి. మలయాళ స్టార్ మమ్ముట్టి రంగూన్ రౌడీ, ప్రియమణి నటించిన విస్మయంతో పాటు పలు తెలుగు క్లాసిక్ చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి.