శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (18:22 IST)

విశ్వ‌క్‌సేన్ `పాగ‌ల్` ఫ‌స్ట్‌లుక్ ఇదే

Viswak Sen, pagal, look
`హిట్‌` సినిమా ఫేమ్ విశ్వ‌క్ సేన్ తాజా సినిమా `పాగ‌ల్‌`. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. మ్యూజిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు స‌మ‌ర్పణ‌లో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది.  ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. మంగ‌ళ‌వారంనాడు పాగ‌ల్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌తో పాటు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న  విడుదల‌చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. 
 
ఈ పోస్ట‌ర్‌లో విశ్వ‌క్‌సేన్ యూబ‌ర్‌కూల్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో గులాబిపూలు ప్రేమ‌ను, స్వ‌చ్చ‌త‌ను సూచిస్తున్నాయి. ర‌ధ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి ఎస్ మ‌ణికంద‌న్‌, ఎడిటింగ్ గ్యారీ బీహెచ్ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంటాయ‌ని యూనిట్ చెబుతోంది. మాస్ యాక్ష‌న్ సినిమాలు చేసే విశ్వ‌క్‌సేన్ ఇందులో స‌రికొత్త‌గా క‌న్పిస్తాడ‌ని తెలియ‌జేస్తుంది. ఇందులో త‌ను డాన్స్‌లు బాగా చేశాడ‌ని చెబుతోంది. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేసున్నామ‌ని వివ‌రించింది.