సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (16:42 IST)

ఈనెల 26న అంగుళీక వ‌చ్చేస్తుంది

Devgill, Anguleka, varma
వివ్యశాంత్, శేఖర్ వర్మ హీరో హీరోయిన్లుగా న‌టించిన సినిమా `అంగుళీక. దేవ్ గిల్ కీల‌క పాత్ర పోషించాడు. ప్రేమ్ ఆర్యన్ ను దర్శకుడిగా  పరిచయం చేస్తూ మాస్టర్ టి హర్షిత్ సాయి సమర్పణలో కోటి తూముల, A.జగన్మోహన్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈనెల 26న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. గతేడాది అన్ని హంగులు పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవగా కోవిడ్ నేపథ్యంలో థియేటర్లు మూత పడటంతో సినిమా విడుదలను వాయిదా వేయడం జరిగింది.  ప్రస్తుతం  ఈనెల  26వ తేదీన వరల్డ్  వైడ్ గా గ్రాండ్ గా  రిలీజ్ చేయబోతున్నాం.  గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కిన  మా చిత్రంలో కమర్షియల్ గా అన్ని హంగులు ఉంటాయని  చిత్ర నిర్మాత కోటి తూముల ఈ సందర్భంగా తెలియజేశారు. 
 
క‌థ‌ప‌రంగా చెప్పాలంటే `ఈచిత్రం సూర్యభగవానుని అంశతో జన్మించిన అమ్మాయికి.. కాల చక్రాన్ని దూషిస్తూ ఎదురు తిరిగిన దుష్ట శక్తికి మధ్య జరిగిన పోరాటమే  మా చిత్ర కథాంశం` అని చిత్ర దర్శకుడు ప్రేమ్ ఆర్యన్ తెలిపారు. కోటేశ్వరరావు, మేకా రామకృష్ణ, పంకజ్, జయవాణి, వేణు, జబర్దస్త్ అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి  మాటలు బి.సుదర్శన్, కెమెరా: చిట్టి బాబు, మ్యూజిక్: శ్యామ్ కె ప్రసాన్, ఆర్ట్: వెంకటేష్ గ్రాఫిక్స్ : 24 ఫ్రేమ్స్, ఆర్ జి బి స్టూడియోస్, యుక్త 2D,  ఎడిటింగ్: మార్తాండ్ కె  వెంకటేష్,  నిర్మాణ నిర్వహణ: సిహెచ్ రాంబాబు.